English | Telugu

Eto Vellipoyindhi Manasu : మహాయాగాన్ని సీతాకాంత్ పూర్తిచేయగలడా.. ఆమె కనిపెట్టేసిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -197 లో....రామలక్ష్మికి ఆక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని నందినిని హారిక అడుగుతుంది. నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా.. నేను అంత ఘోరంగా ఆలోచిస్తే ఇప్పుడే సీతాని సొంతం చేసుకునేదాన్ని కానీ నేను సీతాని ఇష్టంగా తను కూడా నన్ను ఇష్టంగా ప్రేమించలని అనుకుంటున్నానని నందిని బాధపడుతుంది. అసలు ఆ ఆక్సిడెంట్ ఎలా అయింది. ఎవరు చేసారో కనిపెట్టి సీతాకీ నేనేం తప్పు చెయ్యలేదని నిరూపించాలని నందిని అనుకుంటుంది.

ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి.. అసలు రామలక్ష్మి ఆక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతాడు. సీతకాంత్ పెద్దాయనని పక్కకి తీసుకొని వెళ్లి నందిని గురించి చెప్తాడు. నందిని కావాలనే ఇలా చేసింది. నన్ను రామలక్ష్మిని దూరం చెయ్యాలని అనుకుంటుంది. ఒక్కప్పుడు లవ్ చేసింది రిజెక్ట్ చేశాను.. తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరం అయినా వెళ్తుందని సీతాకాంత్ అంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని పెద్దాయన అడుగుతాడు. త్వరలోనే వేరే పెట్టుబడి పెట్టె కంపెనీస్ రప్పించి నందినితో ఉన్న కంపెనీ రిలేషన్ ఆపేస్తానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు రామలక్ష్మి నిద్ర లేచి అసలు అత్తయ్య ఈ పని చేసి ఉండకపోవచ్చు.. తను చెస్తే తన కళ్లలో భయం కలిగేదని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి గుడికి వెళదామని రామలక్ష్మితో అంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడికి వెళ్తారు. స్వామి దగ్గరికి వెళ్తారు. నువ్వు మొక్కు తీర్చుకోమని రామలక్ష్మిని సీతాకాంత్ పంపిస్తాడు. జరుగుతున్న సిచువేషన్ గురించి సీతాకాంత్ స్వామికి చెప్తాడు. మీరు మహాయాగం చెయ్యాలని చెప్తాడు. ఏ పరిస్థితిలోనైనా ఆ యాగం ఆగకుండా చూసుకోండని స్వామి చెప్పగానే సీతాకాంత్ సరే అంటాడు. ఆ విషయం రామలక్ష్మికి చెప్పగా తను కూడ సరే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. యాగం గురించి ఇంట్లో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.