English | Telugu

Eto Vellipoindi Manasu : అత్త ప్లాన్ సక్సెస్.. భార్యాభర్తలని దూరం చేయగలుగుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -243 లో... రామలక్ష్మి, సీతాకాంత్ లు స్కూటీ మీద రావడంతో శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు కుళ్ళుకుంటారు. పెద్దాయన, సిరి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. రామలక్ష్మికి ఐస్క్రీమ్ తినిపిస్తూ లోపలికి తీసుకొని వెళ్తాడు సీతాకాంత్. రామలక్ష్మి సీతాకాంత్ బావ గారిని కొంగున కట్టేసుకుంది. ఇక వాళ్ళకి వారసుడు వస్తే.. మన పరిస్థితి ఏంటని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది.

ఆ తర్వాత శ్రీవల్లి పడుకున్న సందీప్ ని తీసుకొని వచ్చి.. రామలక్ష్మి కోసం బావగారు స్కూటీ కొన్నాడు. వాళ్ళు సరదాగా బయట తిరిగి వచ్చారు. మనం కూడా అలా సరదాగా బయటకు వెళదామంటూ సందీప్ ని బలవంతంగా బయటకు తీసుకొని వెళ్తుంది. తనే డ్రైవ్ చేస్తుంది. దాంతో ఇద్దరు కిందపడిపోతారు. మరొకవైపు రామలక్ష్మి చేతికి చిలకలు పెట్టుకొని సీతాకాంత్ కి తినిపిస్తుంది. రోజు ఇలాగే తినిపించమంటూ సీతాకాంత్ అంటాడు. అలా ఇద్దరు ఒకటి ఆయనట్లు శ్రీలతకి కల కంటుంది. ఒక్కసారిగా లేచి వాళ్ళు ఒకటి అవ్వకూడదనుకుంటుంది. మరొక వైపు సీతాకాంత్ దగ్గర కి రామలక్ష్మి వచ్చి.. థాంక్స్ చెప్తుంది. మీరు నాకు సపోర్ట్ గా ఉన్నారని అనగానే.. ఒక బంధం నిలబడాలంటే నమ్మకం, నిజాయితీ ఉండాలి.. దాపరికం ఉండకూడదు నేనే నీ విషయంలో అదే కోరుకుంటున్నానని సీతాకంత్ అనగానే.. అభి వచ్చిన విషయం చెప్పాలనుకుంటుంది రామలక్ష్మి. అటు వైపు తిరిగి అభి గురించి చెప్తుంది కానీ అప్పుడే సీతాకాంత్ కి ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. సీతాకాంత్ రావడం చూసి నేను చెప్పింది ఏది వినలేదా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు సిరి గదిలోకి శ్రీలత వెళ్లి పూల స్టాండ్ ని కింద పడేస్తుంది. దాంతో సిరి భయపడి గట్టిగ అరుస్తుంది.అందరు వస్తారు. శ్రీలత కూడా ఏం తెలియనట్లు వస్తుంది.

నాకు భయంగా ఉందని సిరి అంటుంది. నేను ఉంటానని సీతాకాంత్ అనగానే.. నేను ఉంటానని రామలక్ష్మి అంటుంది. వీళ్ళను విడగొట్టానని శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరకి రామలక్ష్మి వచ్చి.. ఇదంతా నీ ప్లాన్ అని తెలుసని అంటుంది. అయితే ఏం చేస్తావంటు శ్రీలత అంటుంది. నువ్వు అనుకున్నదేం చెయ్యాలేవంటూ శ్రీలతకి రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నందినికి శ్రీలత ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. మీరు నాకు వదిలెయ్యండి. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నుండి సీతా నుండి రామలక్ష్మి పేరు వినపడదని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.