English | Telugu
సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ సమస్యలను అడిగి తెలుసుకున్న సుమ!
Updated : Dec 11, 2022
క్యాష్ షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి మహేష్, మధునందన్, రాజ్ కుమార్, మహేష్ విట్టా వచ్చారు. ఇందులో సుమ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ డిమాండ్స్ ని అడిగి తెలుసుకుంది. "మాకు వర్క్ టైం తగ్గించి, రెస్ట్ ఎక్కువగా ఇవ్వాలి" అని ఆడియన్స్ ఆన్సర్ చేశారు.
జావా అంటే ఏమిటి అని సుమ అడిగేసరికి "సగ్గు జావా, నూకల జావా" అని ఆన్సర్ ఇచ్చాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మహేష్. "అసలు నువ్వెందుకు ఆన్సర్ చెప్పావ్ నిన్ను అడిగానా" అని ఫైర్ అయ్యింది సుమ. "మీరు లాప్ టాప్ లు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటున్నాయి కానీ మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండడం లేదు" అని సీరియస్ అయ్యాడు రాజ్ కుమార్. "నా కేబిన్ చుట్టూ అమ్మాయిలు ఉండాలి" అని ఒక ఆడియన్స్ నుంచి ఒక కుర్రాడు చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇలా ఈ వారం క్యాష్ షో ఎంటర్టైన్ చేయబోతోంది.