English | Telugu
కచ్చా బాదంగా పేరు మార్చుకున్న ధనరాజ్
Updated : Jun 8, 2022
కామెడీ స్టార్స్ ధమాకా ప్రోగ్రాంకి ఇటీవల మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ప్రతీ వారం కామెడీ స్కిట్స్ తో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు కమెడియన్స్. ఇక నాగబాబు, శేఖర్ మాస్టర్ నవ్వులతో ఈ షో ఇంకా ఎనర్జిటిక్ గా మారుతోంది. జూన్ 12 మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోయే ఎపిసోడ్ హైలైట్స్ ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో ధనరాజ్ కచ్చా బాదాంగా పేరు మార్చుకుని టాప్ టు బాటమ్ గ్రీన్ కలర్ డ్రెస్ తో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు.
"నా పేరు కచ్చాబాదం, పిక్కలు తక్కువేమో గాని మా ఇంట్లో మొక్కలు చాలా ఎక్కువండి. చెట్టు గురుంచి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా అంటే యాంకర్ ఏమన్నాడు అంటుంది ..చెట్టు అంటే ట్రీ అని అన్నాడు ఆ ఇంగ్లీష్ కవి " అనేసరికి అందరు పగలబడి నవ్వేస్తారు. చెట్లను ప్రేమించండి అన్నారు కానీ చెట్ల చాటుకెళ్ళి ప్రేమించుకోడానికి సిగ్గులేదు అనే డైలాగ్స్ తో మంచి ఫన్నీ స్కిట్ చేసాడు. స్టార్ హీరో అప్పారావుకి అసిస్టెంట్ గా ఆర్పీ చేసిన స్కిట్ కూడా కాస్త ట్రెండీగా ఉంది. ఆర్పీ ఒక పక్కన పెళ్లి చేసుకుంటూ కూడా అప్పారావు వచ్చేసరికి పంతులు గారు చెప్పే పెళ్లి మంత్రాలు చదువుతూ అప్పారావుకి గొడుగు పట్టి టచ్ అప్ చేసే క్యారెక్టర్ లో బాగా కామెడీని పండించాడు. ఇంకా చమ్మక్ చంద్ర స్కిట్, ముక్కు అవినాష్ స్కిట్స్ కూడా ఈ ఎపిసోడ్ లో ప్రసారం కానున్నాయి.