English | Telugu

దేవి శ్రీప్రసాద్ నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడేమో!

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీప్రసాద్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన సాంగ్స్ లో చాలా వరకు హిట్టే. ఐతే అసలు శ్రీప్రసాద్ కాస్త దేవి శ్రీప్రసాద్ గా ఎలా అయ్యాడో ఎంఎస్ రాజు ఆయన మాటల్లో చెప్పారు. అనుకోకుండా ఒక రోజు రైటర్ సత్యమూర్తి గారింటికి వెళ్లిన తనకు ఒక గదిలో ఒక 16 ఏళ్ళ కుర్రాడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని తెగ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడట. వెంటనే ఎంఎస్ రాజు కూడా 'ఒక సాంగ్ సిట్యువేషన్ చెప్తాను చెయ్యి' అన్నారట. నిజంగానే శ్రీప్రసాద్ కూడా రెడీ చేసి ఉంచారట.

రెండు రోజుల తర్వాత పెద్ద వర్షం పడుతోంది. అప్పుడు శ్రీప్రసాద్ ఫోన్ చేసి 'ట్యూన్ రెడీ గా ఉంది రండి వినిపిస్తాను' అనడం,రాజు బయల్దేరడం జరిగింది. ఐతే వాళ్ళింటికి దగ్గరలో ఉండగా కారు ఆగిపోయింది. 'అతని దగ్గరకు వెళ్లే టైంలో ఏమిటి ఈ కారు ఇలా ఆగిపోయింది' అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారట. మళ్ళీ ఆలోచించుకుని 'చాలా చిన్న కుర్రోడు చెప్పగానే ఏదో ట్రై చేసాడు ఒక సారి వెళ్లి చూద్దాం' అని చివరికి అలా 'దేవి' మూవీకి మంచి ట్యూన్స్ అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.

"దేవి శ్రీప్రసాద్ నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడేమో" అని చెప్పుకొచ్చారు అలీతో సరదాగా ప్రోగ్రాంలో. "ఐనా దేవి శ్రీకి కూడా చాలా తపన ఉంది. అంతేకాదు చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా. తాను ఏ ఔట్‌పుట్‌ ఇద్దామనుకుంటాడో దాని కోసం బాగా కష్టపడతాడు. అందులోనూ దేవి శ్రీతో బాలు గారు కూడా పని చేశారు. ఒక సందర్భంలో ఆయనకి కూడా కోపం వచ్చింది. కానీ సర్దిచెప్పాను" అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

రీసెంట్ గా జరిగిన ఆయన పుట్టిన రోజుకు దేవి ఒక మూవీ రికార్డింగ్ థియేటర్లో ఉండి, రాజు గారికి ఫోన్ చేసి ఆర్కెస్ట్రా టీంతో హ్యాపీ బర్త్ డే మ్యూజిక్ స్పాట్ లో ప్లే చేయించి, కేక్ కట్ విషెస్ చెప్పారట.. "నిజంగా ఈ ఇయర్ నాకు పెద్ద సర్ప్రైజ్" అని దేవి శ్రీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు ఎంఎస్ రాజు.