English | Telugu

Karthika Deepam2 : కాశీని మోటివేట్ చేసిన శ్రీధర్.. కార్తీక్ నిజం చెప్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -479 లో..... కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నువ్వే కావాలని అత్తామామయ్యని విడగొడుతున్నావని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మరొకవైపు శ్రీధర్ వాళ్ళు అందరూ భోజనం చేస్తుంటే కార్తీక్ రిటర్న్ చెక్ ఇచ్చిన విషయం శ్రీధర్ ఇంట్లో వాళ్లకి చెప్తాడు.

వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ.. ఒకరు ఇస్తే తీసుకోడని శ్రీధర్ అంటుంటే.. కాశీ తనని అంటున్నాడని ఫీల్ అయ్యి లేచి వెళ్తుంటాడు. కూర్చో అల్లుడు ఎందుకు అన్నింటికి ఫీల్ అవుతున్నావ్.. నిన్ను జాబ్ చెయ్ అనట్లేదు.. నీకు కావాల్సినంత టైమ్ తీసుకొ హ్యాపీగా ఉండు.. ఇలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవ్వకని కాశీని శ్రీధర్ మోటివేషన్ చేస్తాడు. ఆ తర్వాత నేను బయటకు వెళ్తున్నానని చెప్పి శ్రీధర్ అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత కాంచనకి శ్రీధర్ చెక్ ఇస్తే కార్తీక్ తీసుకోలేదన్న విషయం తెలుస్తుంది. ఎందుకు తీసుకోలేదని కార్తీక్ ని కాంచన అడుగుతుంది.

అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఎప్పుడు నా కొడుకుపై నమ్మకం ఉంది అంటావ్.. మరి ఇప్పుడు ఏంటి అమ్మ ఇలా అంటున్నావని కార్తీక్ అంటాడు. నువ్వు ఆ ఇంట్లో పని చేయడం నాకు ఇష్టం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ని శ్రీధర్ బయటకు తీసుకొని వెళ్లి.. ఎందుకు నువ్వు ఆ ఇంట్లో పని చేస్తున్నావని అడుగుతాడు. దీప ఋణం తీర్చుకోవడానికి అని కార్తీక్ అంటాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో నా మీద ఒట్టే చెప్పకపోతే అంటాడు. అలా ఏం వద్దు.. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని కార్తీక్ అంటాడు. కార్తీక్ వెళ్ళిపోయాక మీరు చెప్పరు.. నేనే తెలుసుకుంటానని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.