English | Telugu

Brahmamudi : ఆగిపోయిన రాజ్ , యామినిల పెళ్ళి.. కావ్యకి కొత్త సవాల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -755 లో..... యామిని తప్పు చేసిందని అప్పు నిరూపించే ప్రయత్నం చేస్తుంది కానీ సాక్ష్యాలు లేకుండా రాహుల్, రుద్రాణి చేస్తారు. దాంతో రాజ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మీరు యామిని తప్పు చెయ్యలేదని నమ్ముతున్నారా అయితే పెళ్లికి ఇంకా టైమ్ ఉంది కదా పెళ్లి చేసుకోండి అని రాజ్ తో కావ్య అంటుంది.

దాంతో యామిని నటిస్తూ ఎవరు నాకు సపోర్ట్ గా లేకపోయిన నువ్వు ఉన్నావ్ కళావతి థాంక్స్ అని కావ్య ని యామిని హగ్ చేసుకొని ఇక రాజ్ నా వాడు అని అంటుంది. నాకు ఇంకా నమ్మకం ఉంది పెళ్లి జరగదని కావ్య అంటుంది. ఆ తర్వాత యామిని మెడలో రాజ్ తాళి కట్టబోతు కావ్యతో ఉన్నా జ్ఞాపకాలు గుర్తుచేసుకొని తాళి కిందపడేస్తాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. ఇష్టం లేని పెళ్లి చేసుకొని యామినికి అన్యాయం చెయ్యలేనని రాజ్ అంటాడు. మరొకవైపు దుగ్గిరాల కుటుంబం మొత్తం డాన్స్ చేస్తుంది. అప్పుడే కావ్య వచ్చి సాంగ్స్ అఫ్ చేసి ఎందుకిలా చేస్తున్నారంటూ చిరాకు పడుతుంది.

మరొకవైపు యామిని లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది తన పేరెంట్స్ ఇంకా రాజ్ ఎంత రిక్వెస్ట్ చేసిన డోర్ తియ్యదు. నీ వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని రాజ్ తో వైదేహీ అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తున్నాడని తెలిసి కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది. నువ్వు రాజ్ ప్రపోజ్ ఆక్సెప్ట్ చేస్తే నీ అక్క తన పాప ఇంటికి రారు అని యామిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడే కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నేను వెళ్ళాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.