English | Telugu

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడని చెప్పిన అపర్ణ.. రాజ్ కొత్త గెటప్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -702 లో.....రుద్రాణి కావాలనే కొంతమందిని ఆఫీస్ నుండి రప్పిస్తుంది. వీళ్ళందరు రాజ్ కి సంతాపం సభ ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నారని అనగానే అపర్ణ ఏదో అనాలని వెళ్తుంటే.. కావ్య ఆపుతుంది. కావ్య ఆపడం రుద్రాణి చూస్తుంది. అలా పిలిపించడంతో ఇంట్లో అందరు రుద్రాణిపై కోప్పడతారు. వాళ్ళను కావ్య పంపిస్తుంది.

నా కొడుకు బ్రతికే ఉన్నాడు త్వరలోనే వస్తాడని అపర్ణ చెప్పగానే రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. ఆ తర్వాత ఇలా తిట్లుపడితే గాని మనకి బుద్ధి రాదని రుద్రాణితో రాహుల్ అంటాడు. తిడితే తిట్టింది గాని ఏదో జరుగుతుందని అర్ధం అవుతుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ ని కావ్య కలుస్తుంది. రాజ్ గెటప్ మార్చి వస్తుంటే.. ఏంటి ఇలా తయారు అయ్యారని అంటుంది. మనం సీక్రెట్ ఏజెంట్ లో వర్క్ చేస్తున్నాం అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నామంటూ రాజ్ అర్ధం లేకుండా మాట్లాడతాడు. మరొకవైపు రాహుల్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆఫీస్ లో జరిగే విషయాలు తెలుసుకుంటాడు. మరొకవైపు ఒక దగ్గర దొంగతనం జరుగుతుంటే రాజ్ వెళ్లి ఆపుతాడు. మేం ఆఫీసర్ అంటూ మాట్లాడతాడు అప్పుడే పోలీసులు వస్తారు. వాళ్లతో కూడా రాజ్ అలాగే మాట్లాడతాడు.

దాంతో కావ్య రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్తుంది. మీరు కొరియర్ స్టేషన్ నుండి పంపారు కదా.. అందుకే నేను ఇలా ఉహించుకున్న అని రాజ్ అంటాడు. అదంతా ఏం లేదు.. మా చెల్లి పోలీస్ డిపార్ట్ మెంట్.. తను పంపింది కొరియర్ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ ఆఫీస్ లో జరుగుతున్న విషయాలు రుద్రాణికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.