English | Telugu

ఫైమా మనసు ఎంత గొప్పదో...

పటాస్ ఫైమా గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎందుకంటే పటాస్ షో నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ కి కూడా వెళ్లొచ్చి మంచి పేరు సంపాదించింది. అలాంటి ఫైమాలో హ్యుమానిటీ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె కొంతమంది స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేసింది.

విషయం ఏమిటి అంటే ఫైమా-ప్రవీణ్ ని సోషల్ మీడియాలో ఒక అమ్మాయి కాంటాక్ట్ అయ్యింది. విశాఖపట్నం తాటిచెట్లపాలెంకి చెందిన ఆ అమ్మాయి కొంతమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లేదని దాని కారణంగా వాళ్ళు స్కూల్ కి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయారని చెప్పడంతో ఫైమా మనసు కరిగిపోయింది. ఆ పిల్లల పరిస్థితి చూసి ఫైమా- ప్రవీణ్ స్పందించారు. ఇద్దరూ మాట్లాడుకుని ఆమెకు ఫోన్ చేసి యూనిఫామ్ కి కావాల్సిన డబ్బును అందించారు. దాంతో ఆమె అక్కడి పిల్లలకు యూనిఫామ్ ని తీసుకుని అందించింది. ఇప్పుడు ఆ వీడియోని ఫైమా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా మంది సాయం అడుగుతూ ఉంటారని కానీ పిల్లలు అనేసరికి తన చిన్నప్పుడు తాను యూనిఫామ్ లేక పడిన కష్టం గుర్తొచ్చి వెంటనే స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అందించే ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చింది ఫైమా. ఇక ఆ యూనిఫామ్ అందుకున్న స్టూడెంట్స్ అంతా కూడా ఫైమాకి థ్యాంక్స్ చెప్తూ ఒక వీడియోని పంపించారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.