English | Telugu

క్యారెక్టర్ గురించి మాట్లాడిన విష్ణుప్రియ.. రోహిణిదే తప్పన్న బయాస్డ్ బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికి పన్నెండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే హౌస్ లో విష్ణుప్రియ ఏం చేసిందనేది అందరికి తెలుసు. తను తప్పేం చేసినా ఎడిటింగ్ లో లేపేయ్యండి అని బిగ్ బాస్ మామ ఎడిటర్స్ కి గట్టిగానే చెప్పాడు అనేది సోషల్ మీడియా టాక్. అందుకేనేమో లైవ్ లో విష్ణుప్రియ చేసే కథలన్ని నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో షేర్ చేస్తున్నారు.

రోహిణి-విష్ణుప్రియల మధ్య గొడవ ఎలా మొదలైందంటే.. ఈ వారం మెగా చీఫ్ కోసం రోహిణి, విష్ణుప్రియ, యష్మీ, పృథ్వీ, టేస్టీ తేజ రేసులోకి వచ్చారు. ఇక వారికి ఆటో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.‌ ఇందులో ఆటోలో మొదటగా టేస్టీ తేజని అందరు కలిసి బయటకు తీసేశారు. ఆ తర్వాత రోహిణిని, యష్మీని తీసేయగా పృథ్వీ, విష్ణుప్రియ ఇద్దరే మిగిలారు.‌ మీరిద్దరు గేమ్ ఆడి బయటకు రావాలని యష్మీ అంది. వాళ్ళు చేతిలో చేతులు వేసుకొని బయటకొస్తారు. అంతేకానీ గేమ్ ఆడరని రోహిణి అంది. దాంతో నీ క్యారెక్టర్ తెలుస్తుందని విష్ణుప్రియ అంది. క్యారెక్టర్ గురించి మాట్లాడకని రోహిణి అన్నా వినిపించుకోకుండా . నీ క్యారెక్టర్ దీన్ని బట్టే తెలుస్తుందంటూ విష్ణుప్రియ అంది. ఇక మొదట నిఖిల్ కి ట్రై చేశావ్.. పడకపోయేసరికి పృథ్వీకి ట్రై చేశావ్ నీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది అందుకే ఇన్ని వారాలు ఉన్నావని రోహిణి అంది. ఇది వందకి వంద శాతం నిజం. బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసు.

ఇదే విషయం గురించి నిన్నటి ఎపిసోడ్ లో రోహిణిది తప్పు అంటూ నాగార్జున అనడం పెద్ద దుమారం రేపుతోంది. కంప్లీట్ గా విష్ణుప్రియకి బయాస్డ్ గా బిగ్ బాస్ ఉన్నారని నెట్టింట ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. రోహిణి, అవినాష్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ లాంటి జెన్యున్ అండ్ ఫెయిర్ గా ఆడే కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ మామ అన్యాయం చేస్తున్నాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.