English | Telugu

మాస్క్ మ్యాన్ హరీష్ సింపథీ డ్రామా.. డిఫెండ్ చేసుకోలేకపోయిన కామనర్స్!

బిగ్‌బాస్ సీజన్-9 లో అప్పుడే రెండు వారాలు గడిచిపోయింది. రెండో వారం మర్యాద మనీష్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. సోమవారం నాటి ఎపిసోడ్ లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్స్ హీటెక్కించాయి. బిగ్‌బాస్ తెలివిగా రెండు గ్రూపుల్లోనూ వాళ్లలో వాళ్లు కొట్టుకు చచ్చేలా ఈ నామినేషన్స్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా టెనెంట్స్‌గా ఉన్న కామనర్లని ముందుగా సెలబ్రెటీల నుంచి నామినేషన్స్ చేయాలని చెప్పాడు. కానీ ఇందులో కంపల్సరీగా ఒకరు టెనెంట్ అయి ఉండాలని కండీషన్ పెట్టాడు. దాంతో రెండు గ్రూప్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

కామనర్లు అందరు చాలా సేపు తమ పాయింట్స్ డిస్కస్ చేసుకొని సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా సైనీలని నామినేట్ చేశారు. ముఖ్యంగా ప్రియ, శ్రీజ ఇద్దరు కలిసి రీతూ చౌదరిని నామినేట్ చేశారు. అయితే రీతూను కాపాడటానికి కెప్టెన్ డీమాన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ గట్టిగానే ట్రై చేశారు. కానీ ప్రియ, శ్రీజ, హరీష్ ఒప్పుకోకపోవడంతో రీతూని తీయలేకపోయారు. అయితే తర్వాత తమ నుంచి ఒకర్ని నామినేట్ చేయాలన్నప్పుడు అందరు కలిసి హరీష్‌ సెలెక్ట్ చేశారు. అయితే దీనికి హరీష్ ఒప్పుకోక.. ప్రతీ ఒక్కరిని వాయించి వదిలేశాడు. ముఖ్యంగా డీమాన్‌ని అయితే గట్టిగానే భయపెట్టాడు. సెలబ్రెటీల్లో నలుగుర్ని నామినేట్ చేసేసిన తర్వాత తమలో తాము ఎవరిని నామినేట్ చేయాలా అని టాపిక్ వచ్చింది. ముందుగా హరీష్ మాట్లాడాడు. నా వైపు నుంచి అయితే ప్రియ అనుకుంటున్నాను. ప్రియ ఎందుకంటే సండే రోజు ఎపిసోడ్ లో హోస్ట్ గారి ముందు స్టాండ్ సరిగా తీసుకోకుండా.. లేదు సర్ నేను తప్పు ఒప్పుకుంటున్నానని అన్నారు.. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే తను ఇప్పటికీ కూడా ఫుడ్ మానిటర్ అనుకుంటున్నారు.. ఆమె ఫుడ్ మానిటర్ కాదు కుకింగ్ మానిటర్.. రెండింటికీ తేడా ఉంది.. నాకు ఒక మాట నాకు చివుక్కుమంది.. మనీష్‌కి కూడా బాధ కలగడానికి అదే రీజన్.. ఓనర్స్ మైండ్‌ఫుల్‌గా చూసి తినండి అన్నారు.. ఆ మాట నాకు చివుక్కుమనిపించింది.. తినే ఒక్క ముద్ద కోసం ఈవిడ అలా అనేశారే.. అది లూజ్ టంగ్‌లా అనిపించింది నాకు.. ఆకలేసి లోపల పీకేస్తున్నా కూడా వణికేస్తున్నా కూడా కంట్రోల్ చేసుకున్నా ఠక్కుమని నోరుజారట్లేదంటూ హరీష్ తన నామినేషన్ పాయింట్లు చెప్పాడు. ఇలా మాస్క్ వేసుకొని ఫుడ్ తినలేదనే సింపథీ డ్రామాని ప్లే చేస్తున్నాడు హరీష్.

ఇక వెంటనే ప్రియ నా నామినేషన్ హరీష్ గారు.. అంటూ చెప్పింది. మీ పర్సనల్ అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండటమనేది నాకు అసలు నచ్చలేదు.. లాస్ట్ వీక్‌లో మీకు నాకు అసలు ఒక సంభాషణే రాలేదు.. అంటూ ప్రియ అంది. ఇక కామనర్స్ మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరిగాయి. ఇలా నామినేషన్స్‌ పూర్తయ్యే సరికి బోర్డ్ మీద పవన్ కళ్యాణ్, ప్రియ, శ్రీజ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా, రాము రాథోడ్ ఫొటోలు ఉన్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.