English | Telugu

Bigg Boss 9 Telugu: హౌస్ లో రమ్య చెప్పిన ట్రాష్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. బిగ్ బాంబ్ ఇచ్చింది ఎవరికంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగా ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. బాండింగ్స్ ని దూరం చేయాలనే ఇంటెన్స్ తో వచ్చిన రమ్య ఎవరితో మాట్లాడకుండా ఇండివిడ్యువల్ గా ఆడాలని ప్రయత్నించి బయటకొచ్చేసింది. నిన్నటి సండే ఎపిసోడ్ లో రమ్య బయటకొస్తూ కొంతమంది హౌస్ లో ఉండటానికి అర్హులు కారు అంటు వారికి ట్రాష్ ఇచ్చింది‌. ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఓ సారి చూసేద్దాం.

నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ ని రెండు టీమ్ లుగా విభజించాడు. నిఖిల్, గౌరవ్ ఇద్దరిని టీమ్ లీడర్లుగా చేశాడు నాగార్జున. ఇక ఆ తర్వాత ఇరు టీమ్ లకి 'సెలబ్రిటీ ఐటెం సాంగ్' అనే టాస్క్ పెట్టాడు. ఇందులో నిఖిల్ టీమ్ గెలిచింది. ఆ తర్వాత 'బ్లైండ్ ఫోల్డ్ లో ఫుడ్ ఎక్స్ప్లెనేషన్' అనే టాస్క్ పెట్టాడు నాగ్. ఇందులో గౌరవ్ టీమ్ గెలిచింది. ఇమ్మాన్యుయేల్ ను పవరస్త్రాకు సేవింగ్ పవర్ లాస్ట్ టైమ్ అయిపోయింది. ఇక దానికి పవర్ లేదు. అలాగే తనూజా దగ్గర ఉన్న 'గోల్డెన్ బజర్'కు వచ్చే వారం సేవ్ చేసే పవర్ ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న సంజన - రమ్యలలో ఎవరిని సేవ్ చేస్తావని తనూజను నాగార్జున అడుగగా.. సంజన అని తనూజ అంది. కాసేపటికి హౌస్ ఎలిమినేషన్ రౌండ్ జరుగగా అందులో సంజన సేవ్ అయి రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఇక అందరికి బై చెప్పేసి రమ్య బయటకొచ్చేసింది. ‌ఇక స్టేజ్ మీదకి వచ్చాకా తన జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఐదుగురిని ట్రాష్ క్యాన్ లో వేసి, రీజన్ చెప్పమన్నాడు నాగార్జున. కళ్యాణ్ నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తున్నాడు. దివ్య ఒక్కరితోనే ఉండేది, భరణి వెళ్లాక కోపం ఎక్కువ అవుతోంది. తనూజా ఎవరో చెప్పింది విని మాట్లాడుతుంది అందుకే తను మానిప్యులేటర్. గౌరవ్ మాటల రాక్షసుడు.. ఇగో ఎక్కువ అని చెప్పింది. ఆ తర్వాత ఎమోషనల్ గా గేమ్ ఆడకు. బుర్రవాడు కళ్యాణ్ అంటూ రమ్య చెప్పింది. ఇక ఆ తర్వాత ఈ అయిదు మంది ఇమేజెస్ ను ట్రాష్ క్యాన్ లో వేసింది.

ఇక హౌస్ లోని వాళ్ళతో రమ్యని నాగార్జున మాట్లాడించాడు. అందులో ఇమ్మాన్యుయల్ లేచి.. మిస్ యూ రమ్య అని చెప్పాడు.నా దురదృష్టం ఏంటో నాకోసం వచ్చిన ఇద్దరు దేవతలు రమ్య, అయేషా వెళ్ళిపోయారని ఇమ్మాన్యుయల్ బాధపడ్డాడు. ఇక వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబుగా వాష్ రూమ్ బాధ్యతలను రీతూకి అప్పగించింది రమ్య.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.