English | Telugu

Bigg Boss 8 : టాప్-5 లో ఆ ముగ్గురు.. కన్ఫమ్ చేసిన వీకెండ్ ఎపిసోడ్!

బిగ్ బాస్ సీజన్-8 పదకొండో వారం వీకెండ్ యమ రంజుగా సాగింది. కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ ఆండ్ సెలెబ్రిటీ తో ఫుల్ ఎంగేజింగ్ గా సాగింది. ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ గ్లామర్ గా రెడీ అవ్వగా.. నాగార్జున సాంగ్ తో గ్రాంఢ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక వచ్చీ రాగానే ఫ్యామిలీ వస్తారని చెప్పాడు. కంటెస్టెంట్ యొక్క చిన్నతనంలోని ఫోటో‌ చూపించి గెస్ చేస్తే వారి ఫ్యామిలీ వస్తారని నాగార్జున చెప్పాడు.

మొదటగా ప్రేరణ ఫోటో వస్తుంది. ప్రేరణ గురించి తన తల్లి, చెల్లి, సీరియల్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ ప్రియ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిని చూడగానే ప్రేరణ ఎగిరి గంతేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ కోసం తన చెల్లెలు పావని, యాంకర్ రవి స్టేజ్ మీదకి వచ్చారు. అలానే రోహిణి కోసం తన తండ్రి, నటుడు శివాజీ తరలివచ్చారు. ఇక పృథ్వీ కోసం తన తమ్ముడు విక్రమ్, లవర్ దర్శిని గౌడ స్టేజ్ మీద సందడి చేశారు. గౌతమ్ కోసం తన తల్లి, బిగ్‌బాస్ సోహేల్ వచ్చారు. చివరిగా నబీల్ గురించి బ్రదర్, భోలే వచ్చి స్టేజ్‌ను అల్లాడించారు.

ప్రేరణ కాకుండా మీ దృష్టిలో టాప్-5 ఎవరో చెప్పాలని ప్రేరణ వాళ్ళ అమ్మని టాప్-5 పెట్టమన్నాడు. నిఖిల్ ని మొదటి స్థానంలో ఉంచగా, నబీల్ రెండు, గౌతమ్ మూడు, యష్మీ నాలుగు, రోహిణి ఐదవ స్థానంలో ఉంచింది. విష్ణుప్రియ కోసం తన చెల్లి పావని, యాంకర్ రవి స్టేజ్ మీదకు వచ్చారు. ముందుగా విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ.. నిన్ను బయట చూసే ప్రతి అమ్మాయి.. తాను ఒకబ్బాయిని నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీలో చూసుకుంటున్నారు.. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా లవ్ చేయడమంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. ఇక గౌతమ్ ని మొదటి స్థానంలో ఉంచింది విష్ణుప్రియ చెల్లి. రెండో స్థానంలో నిఖిల్, మూడు నబీల్, నాలుగు పృథ్వీ, అయిదు రోహిణి అని చెప్పింది. ఇక నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో శనివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీ , గౌతమ్ కృష్ణ సేవ్ అయ్యారు. ‌ఇంకా నలుగురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.