English | Telugu

Bebakka Elimination: బేబక్క ఎలిమినేషన్.. తను రోడ్డు మీద పడేసింది ఎవరినంటే!

బిగ్ బాస్ సీజన్-8 మొదలై అప్పుడే వారం పూర్తయింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో సండే ఫండే అంటూ ఆటలు, టాస్క్ లతో సరదాగా గడిపారు. ఇక ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో శనివారం నాడు సోనియాను సేవ్ చేయగా.. ఇక ఆదివారం నాడు బేబక్కని ఎలిమినేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో మొదట శేఖర్ బాషా‌ని.. తరువాత పృథ్వీ, విష్ణు ప్రియలను సేవ్ చేశారు. చివరికిగా నాగ మణికంఠ, బేబక్కలు మాత్రమే మిగిలారు.

ఇక యాక్షన్ రూమ్ లోకి మణికంఠ, బేబక్కలని పిలిచి చివరి సేవింగ్ చేశాడు నాగార్జున. డ్రమ్స్ కొడుతూ చివరికి అందులో నుండి ఓ పేపర్ వస్తుందని చెప్పాడు. ఆ పేపర్ లో ఎవరు సేవ్, ఎవరు ఎలిమినేషన్ వస్తుందని చెప్పగా.. మణికంఠ సేవ్ అయ్యాడు. బేబక్క ఎలిమినేషన్ అయి నాగార్జున దగ్గరికి వచ్చేసింది. ఇక హౌస్ లో తన జర్నీ చూసుకొని నవ్వేసింది. ఇక సోనియాకి తనకు మధ్య అంత రాపో లేదని చెప్తూ సారీ చెప్పింది. ఇక నాగార్జున ఓ బోర్డ్ తీసుకొచ్చి.. అందులో ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఉండకూడదని అనుకుంటున్నారో వారిని రోడ్డు మీద పడేయండి అని నాగార్జున చెప్పగానే.. బేబక్క కొంతమందిని సెలెక్ట్ చేసింది. నిఖిల్, పృథ్వీ, సోనియా, ఫోటోలని రోడ్డు మీద ఉంచింది. ఎవరైనైన మిస్ అవుతున్నావా అని బేబక్కని నాగార్జున అడుగగా.. అందరు తనని మిస్ అవుతున్నట్టుగా చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. కిర్రాక్ సీత బాగా ఎమోషనల్ అయింది.

నేను వాళ్ళందరిలాగే నచ్చాలి కదా.. కుక్కర్ అప్పుడు కూడా సరదాగా సాగిందని కానీ అది సీరియస్ అయ్యిందని సోనియా అంది. అన్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని పృథ్వీ అన్నాడు.‌. నేను ఒక బ్రదర్ అనుకొని ఫర్ గివ్ చేశానంటు బేబక్క అంది. కిచెన్ లో స్టిక్ట్ గా ఉండాలని నిఖిల్ చెప్పగా బేబక్క ఆ రూల్ ఫాలో అయింది‌. సీతకి నేనంటే ఇష్టం సర్.. కానీ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అలా చేసాను సారీ సీత అంటు బేబక్క అనగానే.. సీత వెక్కి వెక్కి ఏడ్చింది. అక్క తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటాను.. కానీ నిన్ను రాంగ్ గా లీడ్ చేయాలని కాదని నిఖిల్ అన్నాడు. ఇక నెగెటివ్ ఏం లేదు.. ఇంప్రూవ్ అవ్వాలని మణికంఠతో బేబక్క అంది. ఇలా ఒక్కొక్కరితో తన అనుభవాలని షేర్ చేసుకొని బేబక్క ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.