English | Telugu
జాతరలో తప్పిపోయిన అనుపమ వాళ్ల బావ!
Updated : Jul 28, 2022
ప్రతీ ఆదివారం ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలని అందిస్తున్న మల్లెమాల ఎంటర్ టైన్మెంట్ ఈ షోని కూడా ప్రజెంట్ చేస్తోంది. రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం సుడిగాలి సుధీర్ హోస్ట్ గా మొదలైన ఈ షో ప్రస్తుతం మంచి రేటింగ్ తో కొనసాగుతోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలకు సంబంధించిన టీమ్ లీడర్స్, కమెడియన్ లు అంతా ఈ షోలోనూ పాల్గొంటున్నారు.
ప్రధానంగా ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, అన్నపూర్ణమ్మ, వర్ష, ఇమ్మానుయేల్, ఫైమా.. తదితరులు ఈ షోలో తమదైన స్కిట్ లతో ఆకట్టుకుంటున్నారు. ఈ నెల 31న ఆదివారం ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ వారం `బోనాల జాతర` పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో `కార్తికేయ 2` టీమ్ సందడి చేసింది. నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ఆగస్టు 12న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో పాల్గొని సందడి చేశారు. కొంత మంది కంటెస్టెంట్స్ పవన్ కల్యాణ్, బాలయ్య, విక్టరీ వెంకటేష్ లని అనుకరిస్తూ వారి పాటలకు డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంటోంది. జాతరలో చిన్నప్పుడు నా మరదలు తప్పిపోయిందని నిఖిల్ అనగానే, అదే టైమ్ లో మా బావ కూడా మిస్సయ్యాడని అనుపమ అనేసింది. దీంతో ఇమ్మానుయేల్ స్టేజ్ పైకి వచ్చేసి "నేనే అనుపమ బావ" అంటూ రచ్చ చేశాడు. ఆ తరువాత అనుమపతో కలిసి లేడీ కంటెస్టెంట్ లంతా "రాను రానంటూనే సిన్నదో.." అంటూ అదిరిపోయే స్టెప్పులేశారు. 'కార్తికేయ 2' టీమ్ తో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్ చేసిన అల్లరిని చూడాలంటే జూలై 31న ఈటీవీలో ప్రసారం అయ్యే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.