English | Telugu

హౌస్ లో సూట్ కేస్ లు.. ఆ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-8 రోజుకో ట్విస్ట్ తో దూసుకుపోతుంది. ఇన్ఫినిటీ సీజన్ అని దానికి తగ్గట్టుగానే ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. అందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఒక ఆఫర్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో మూడు సూట్ కేసు లని పెట్టాడు. అవి ఎవరు తీసుకుంటారో వాళ్ళ ఇష్టానికే వదిలేసాడు బిగ్ బాస్.

అందరు ఆ సూట్ కేసు తీసుకుంటే ఏం ఎఫెక్ట్ ఉంటుందోనని, ఏముంటుందో అని హౌస్ మేట్స్ అందరు టెన్షన్ పడుతుంటారు. కానీ ఫైనల్ గా నబీల్, పృథ్వీ, రోహిణి ముగ్గురు ధైర్యం చేసి ఒక్కొక్కరు ఒక్కో సూట్ కేసుని తీసుకుంటారు. అంత ఆశ తోటి పట్టుకోకూడదని గంగవ్వ అంటుంటే.. ఏది అయితే అది అయింది అనే ధైర్యం చేసే పట్టుకున్నానని నబీల్ అంటాడు. ఈ రోజు మీ దైర్యం మీకేం ఇచ్చిందనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా.. మంచిని కోరుకున్నా మంచే జరుగుతుంది అనుకుంటున్నానని రోహిణి అంటుంది. మీ ముగ్గురు సూట్ కేసు పట్టుకున్నందున డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండెర్స్ అయ్యారని బిగ్ బాస్ అనగానే.. ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు. కంటెండర్ అయినప్పటికి మీరు కొన్ని ఛాలెంజ్ ఫేస్ చెయ్యాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు.

ఆ సూట్ కేసు ని తీసుకుంటే డైరెక్ట్ నామినేషనో లేక ఎలిమినేషన్ ఉంటుందోనని అందరు భయపడ్డారు. అందుకే ఆ రిస్క్ ఎందుకని హౌస్ మేట్స్ లైట్ తీసుకున్నారు. కానీ డేర్ చేసిన ముగ్గురికి బెన్ఫిట్ అని చెప్పాలి. వారమంతా జరిగే టాస్క్ లలో విన్ అయితే మెగా చీఫ్ కంటెండర్ చీఫ్ వస్తుంది. అలాంటది అలా ఓ సూట్ కేస్ తీసుకుంటే అవకాశం రావడం అనేది నిజంగా లక్ అనే చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడో లేదో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.