English | Telugu

ఆస్తి మొత్తాన్ని తులసి పేరు మీద రాసేస్తానన్న అంకిత

తులసి ఆంటీని తన తల్లి అనుక్షణం అవమానిస్తోందని బాధపడిన అంకిత.. గాయత్రికి గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తుంది. 'ఒక వేళ ఆస్తి నాకు వస్తే గనక అదంతా తులసి ఆంటీ పేరు మీద రాసేస్తా ఇదే మీరు ఆంటీని అవమానించినందుకు పెనాల్టీ' అని చెప్పేసరికి గాయత్రి ఉలిక్కిపడుతుంది. వెంటనే ఈ విషయాన్ని లాస్యకి, అభికి చెప్తుంది. అంకిత ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చుకోదు అంటూ గాయత్రీ చెప్పేసరికి.. 'ఆ ఆస్తిని అంకిత పేరు మీద కాకుండా అభి పేరు మీద రాయించండి' అని సలహా ఇస్తుంది లాస్య. కుదరదు.. 'తల్లి ఆస్తి కూతురికి రాయాలి తప్ప అల్లుడికి కాదు' అంటూ గట్టిగా చెప్తాడు అభి. అత‌ని మీద లాస్య కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. మరో పక్క అభిని ఎవరి వలలో పడకుండా కాపాడుకుంటాను అంటూ మావగారితో చెప్తుంది తులసి.

లాస్య ఆంటీ మాటలు వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో సాధ్యం కాదు అంటూ అభి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే పనిగా గాయత్రిని కూడా రెచ్చగొడుతుంది లాస్య. అభి పేరు మీదకు ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ లాస్యకు చెప్తుంది గాయత్రి. లాస్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆస్తి అభి పేరు మీద ఉంటే గనక నందుతో కలిసి అభిని ఒక ఆట ఆడుకోవచ్చని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కదా ట్రిగ్గర్ నా చేతికి వచ్చింది.. ఇక నేను కథ నడిపిస్తాను అంటూ మనసులో నవ్వుకుంటుంది లాస్య. గాయత్రీ ఆస్తి అభి పేరు మీద రాసిందా? తులసి కొడుకును ఎలా కాపాడుకుంటుంది? ఈ రోజు సాయంత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.