English | Telugu
చరణ్ కి స్టేజి మీద ప్రొపోజ్ చేసిన శ్రీముఖి
Updated : Jul 30, 2022
"సరిగమప" ది సింగింగ్ సూపర్ స్టార్ట్ సెమీ ఫైనల్ కు వచ్చేసింది. ఇటీవల రిలీజ్ ఐన ఈ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి సాయి శ్రీచరణ్ కి ఇండైరెక్ట్ గా ప్రొపోజ్ చేసేసింది. "ఆ నీలి గగనాల ఓ దివ్య తార" అంటూ పాట పాడి అందరిని మైమరిపించాడు తన గాత్రంతో. ప్యూర్ లవ్ తో చరణ్ ఈ పాట పాడాడు అని కోటి గారు కామెంట్ చేసేసరికి చరణ్ కూడా భలే సిగ్గుపడిపోతాడు. "నాకు నీ పెర్ఫార్మెన్స్ చాలా హ్యాపీగా అనిపించింది" అని స్మిత బెస్ట్ కంప్లిమెంట్ ఇస్తుంది. ఇక పాట మధ్యలో " ఈ పరిచయం ఒక వరమా , నా మనసు పడిన విరహ వేదన తొలి ప్రేమలోని మధుర భావన " అనే చరణాలని చరణ్ తో జత కట్టి పడేసరికి జడ్జెస్ అంతా విజిల్స్ వేస్తారు.
ఇక తర్వాత "మోవయ్యా" అంటూ చరణ్ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. "మా ఆవిడ రావాల్సింది రాలేకపోయింది" అని ఆయన అనేసరికి "అత్తమ్మా" అంటుంది శ్రీముఖి. చరణ్ వాళ్ళ నాన్నకు కోపం వచ్చి "అత్తమ్మో, గిత్తమ్మో ఎవరో ఒకరు కానీ ..ఆవిడ నిన్ను మూడు ప్రశ్నలు అడగమంది. వాటికి నువ్వు సరిగ్గా ఆన్సర్స్ చెప్తే తనకేం ఇబ్బంది లేదు కంటిన్యూ అవ్వొచ్చు అని చెప్పింది " అంటారు. సరే అడగండి మావయ్య అంటుంది శ్రీముఖి. నీకు "ముగ్గు వేయడం వచ్చా శ్రీముఖి" అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు.. "ముగ్గులోకి దింపడం వచ్చు మావయ్య" అంటుంది. ఆ ఆన్సర్ కి అందరూ కెవ్వుమని నవ్వుతారు. ఇలా ఈ వారం ఎపిసోడ్ శ్రీముఖి, చరణ్ మధ్య చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్స్ తో అందంగా ఎంటర్టైన్ చేయబోతోంది. మరి మిగతా రెండు ప్రశ్నలు మోవయ్యా ఏం అడిగారు, శ్రీముఖి ఏం జవాబులు ఇచ్చింది..ఫైనల్ గా చరణ్ కి, శ్రీముఖికి లైన్ క్లియర్ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూసెయ్యాల్సిందే.