English | Telugu

రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..అన్న మాటకు సీరియస్ ఐన యాంకర్ ఝాన్సీ


ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కాకమ్మ కథలు ఎపిసోడ్ లో తేజస్వి హోస్ట్ గా చేస్తూ వచ్చే సెలబ్రిటీస్ ని ముప్పుతిప్పలు పెట్టె ప్రశ్నలు అడిగి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఐతే రీసెంట్ గా అలనాటి యాంకర్ ఝాన్సీ ఆమె కూతురు ధన్య ఎంట్రీ ఇచ్చారు. ధన్య వయసు ఇప్పుడు 22. అని చెప్పేసరికి తేజు తన వయసు 33 అని చెప్పింది. ఇక ధన్య హైట్ 5’9 అని చెప్పింది. ఇండస్ట్రీలో పొడుగైన హీరోయిన్ గా ఈఫిల్ టవర్ అంత ఎత్తు అవుతావనుకుంటా అంటూ కామెడీ చేసింది తేజు. ఇక ధన్యకి సిగ్గు కూడా చాలా ఎక్కువే..సిగ్గు పడుతూనే ఆన్సర్స్ చెప్పింది. ఇక తేజస్విని కూడా ఝాన్సీని ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగింది. "మీరు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు.. ? " అని అడిగేసరికి దానికి ఝాన్సీ సీరియస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినట్టు ఈ ప్రోమోలో చూపించారు.

మరి ఆన్సర్ ఏమిచ్చిందో అనేది ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఇక తాను దేనికి భయపడని ఒక మనిషిని అని తన దగ్గర ఎవరూ లేకపోయినా, తన దగ్గర అసలు డబ్బు లేకపోయినా అస్సలు భయపడను అని చెప్పింది ఝాన్సీ. ధన్య తనకు మణిరత్నం సినిమాలో నటించాలని కోరిక అని చెప్పడంతో ఝాన్సీ షాక్ అయ్యింది. నాని అంటే తనకు పిచ్చి అని చెప్పింది. ఇక తేజస్విని కూడా తనలాగే అల్లరి చేస్తోందని తనలాగే వైబ్స్ ఉన్నాయని వెంటనే ఇంటికి వచ్చేయి అని అడిగింది. తేజు కూడా తనను అడాప్ట్ చేసుకుంటే ఇంట్లో డాన్సులు వేసుకుంటామని ఝాన్సీని అడిగింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కూతురు అంటూ ఝాన్సీ కూడా తేజుని వచ్చేయమని చెప్పింది. ఐతే త్వరలోనే ఝాన్సీ కూతురు ధన్య కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది. ఎందుకంటే ఆల్రెడీ సుమ కొడుకు, సింగర్ సునీత కోడలు ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసాడు. ఇప్పుడు ఝాన్సీ కూతురి వంతు వచ్చింది.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.