ఐస్‌క్రీమ్ లా ఉన్న మేఘాల్ని తినాలనుందంటున్న కాజల్
‘గుడ్ మార్నింగ్ హైదరాబాద్’ అంటూ జనాల్ని తన మాటలతో ఎలా ఐతే నిద్రలేపేదో అలాగే ‘గుడ్ మార్నింగ్ బిగ్‌బాస్’ అంటూ బిగ్‌బాస్ హౌజ్ లో తన హవా కొనసాగించింది. రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, యాంకర్, యూట్యూబర్ గా, నటిగా ఇలా అన్ని రకాలుగా చేసిన, చేస్తున్న రహీమున్నీసా మెహ్సబీనా అలియాస్ ఆర్జే కాజల్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాజల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక మంచి ఆఫర్స్ నే అందుకుంది. సినిమాలతో పాటు ఓటిటి సిరీస్ లో కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘ఎక్స్పోజ్డ్’ అనే వెబ్ సిరీస్ లో ఓ న్యూస్ చానల్‌కు చీఫ్ ఎడిటర్ రోల్ లో నటించింది. అలాంటి కాజల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.