Read more!

English | Telugu

జిమ్ లో ఎవరైనా డివోషనల్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారా?

సింగర్ మంగ్లీ గురించి అందరికీ తెలుసు. ఎంతో కష్టపడి స్టార్ అయ్యింది. కానీ ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ మాత్రం ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది.  ఒకే ఒక్క పాటతో ఆమె  వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది. "ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ" అనే సాంగ్ దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఈ సాంగ్ లో నటించిన సమంతకి ఎంత పేరొచ్చిందో ఈ సాంగ్ పాడిన ఇంద్రావతి చౌహాన్ కి కూడా అంతే పేరొచ్చింది. ఈమెకు బిహైండ్ వుడ్ సంస్థ వాళ్ళు ఈ సాంగ్ పాడినందుకు  గోల్డ్ మెడల్ కూడా ఇచ్చింది.  ఎన్నో మూవీస్ లో  పాటలు పాడినా..జానపద గీతాలు ఆలపించినా రాని గుర్తింపు ఒక్క పుష్ప ఐటమ్ సాంగ్ తో భారీ పాపులారిటీ వచ్చిపడింది. 

అలాంటి ఇంద్రావతి చౌహాన్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. అది కూడా అమ్మవారి పాట "అయిగిరి నందిని" పెట్టుకుని దాన్ని పాడుతూ  థ్రెడ్ మిల్ మీద వాక్ చేస్తూ కనిపించింది. జిమ్ లో ఎవరైనా ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెట్టుకుని వర్కౌట్స్ చేస్తారు కానీ నా దారి వేరు అంటూ ఇంద్రావతి మాత్రం జిమ్ లో భక్తిగా ఎక్సర్సైజు చేస్తూ ఉంది. ఈ విషయాన్నీ మంగ్లీ వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "జిమ్ లో ఎవరైనా డివోషనల్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారా. ట్రెండ్ సెట్టర్ " అని కాప్షన్ పెట్టింది. ఇంద్రావతి  గతంలో "బోల్ బేబీ బోల్" అనే  పాటల కార్యక్రమంలో తన పాటలతో ఆకట్టుకుంది. రీసెంట్ గా రిలీజ్ ఐన జార్జిరెడ్డి మూవీలో కూడా ఒక పాట పాడింది. ఇంద్రావతి చౌహాన్ తన  గాత్రంతో మాత్రమే కాదు తన అందంతో కూడా ఫిదా చేస్తూ ఉంటుంది.