Read more!

English | Telugu

‘ఉగ్రం’ టీమ్ తో హాట్ హాట్ గా గేమ్ ఆడించిన ప్రదీప్

"సర్కార్ సీజన్ 3 " ఫస్ట్ ఎపిసోడ్ మంచి జోష్ తో ఎనెర్జీతో స్టార్ట్ అయ్యింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి ఉగ్రం మూవీ నుంచి హీరో అల్లరి నరేష్, హీరోయిన్ మిర్న మీనన్, డైరెక్టర్ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ వచ్చారు. "ఇందులో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికి 60 సెకండ్స్ టైం ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు బిడ్డింగ్ అమౌంట్ ని బట్టి క్లూస్ ని రివీల్ చేస్తాం. ఎవరైతే ఎక్కువగా అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్లకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే బిడ్ చేసిన అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోకి వస్తుంది. మొదటి 7 ప్రశ్నల వరకు నలుగురు ఆడతారు.

8 వ ప్రశ్న నుంచి ఆ నలుగురిలో హయ్యెస్ట్ ఉన్న ముగ్గురు మాత్రమే ఆడతారు. 9 వ ప్రశ్న నుంచి ఇద్దరు మాత్రమే ఆడతారు. 10 వ ప్రశ్న కోటి రూపాయల కోసం ఒకే ఒక్కరు ఆడతారు" అని రూల్స్ చెప్పి బిడ్డింగ్ స్టార్ట్ చేసాడు. మొదటి ప్రశ్నగా "ఒక లీప్ ఇయర్ లో జులైలో ఉన్న రోజుల్లోంచి ఆగష్టులో ఉన్న రోజులు తీసేసి అక్టోబర్ రోజుల్ని కలిపితే ఎంత వస్తుంది" అన్న ప్రశ్నకు మిర్న 42 వేలకు బిడ్ చేసింది. ఐతే దానికి ఆన్సర్ తప్పు చెప్పింది. తర్వాత "గోవా రాష్ట్రంతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు ఏమిటి" అనే ప్రశ్నకు 1 ,42 ,000 బిడ్ వేసింది మిర్న. దానికి పక్కనుంచి అల్లరి నరేష్ ఆన్సర్స్ అందించేసరికి మిర్న చెప్పి విన్ అయ్యింది. దాంతో విన్ ఐన అమౌంట్ నుంచి సగం నరేష్ గారికి ఇస్తానని చెప్పింది. "మీ టీం నుంచి హీరోయిన్ దగ్గరుండి గెలిపించడం బాగుంది" అని కామెంట్ చేసాడు ప్రదీప్. "సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ ఏమిటి" అని అడిగిన ప్రశ్నకు శ్రీచరణ్ 91 వేలకు బిడ్ చేసి  కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో "ఆయన రెగ్యులర్ గా సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తుంటాడు కదా అందుకే స్పెల్లింగ్ బాగా తెల్సు" అన్నాడు నరేష్. "కీప్యాడ్ మొబైల్ లో నాలుగు లెటర్స్ ఉన్న నంబర్స్ ఏమిటి" అనే ప్రశ్నకు 1 , 80 ,000 కి డైరెక్టర్ విజయ్ బిడ్ చేసి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాడు.

"ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి గారి పేరులో ఉన్న ఎంఎం అంటే ఏంటి" అన్న ప్రశ్నకు "మరకతమణి" అని కరెక్ట్ గా చెప్పాడు. "ప్రస్తుతం చలామణిలో ఉన్న 20 రూపాయల నోటు మీద ఉన్న చారిత్రాత్మక కట్టడం ఏమిటి ? అనే ప్రశ్నకు శ్రీచరణ్ 3 , 50 ,000 కి బిడ్ వేసాడు కానీ ఆన్సర్ చెప్పలేకపోయాడు. "ఎల్లోరా కేవ్స్" అని ఆన్సర్ ఇచ్చేసాడు ప్రదీప్. ఇలా ఉగ్రం టీమ్ తో మంచి గేమ్ ఆడించాడు.