Read more!

English | Telugu

సొసైటీలో పోలీస్, లాయర్ చాలా కీలకం.. ఆ ఐడియాలోంచే ఈ మూవీ వచ్చింది

సర్కార్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ మంచి కామెడీగా సాగింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి ఉగ్రం టీమ్ వచ్చి గేమ్ ఆడారు. ఇందులో హోస్ట్ ప్రదీప్ వాళ్ళను ఎన్నో ప్రశ్నలు వేసాడు. "సాధారణంగా మీరు మంచి కామెడీ చేస్తారు..మీ మూవీస్ లో ఆడియన్స్ ఫుల్ గా నవ్వుకుని వస్తారు. అలాంటి మీకు ఈ కాప్ రోల్ తీసుకోవాలని ఎలా అనిపించింది" అంటూ ప్రదీప్ అడిగేసరికి "నాంది మూవీ చేస్తున్నప్పుడు నన్ను ఈ యాంగిల్ నుంచి కూడా చూడొచ్చు అన్న థాట్ విజయ్ కి వచ్చింది. దానికి ముందుగా విజయ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరం కష్టపడి చేసాం. రిజల్ట్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్యూ ఆడియన్స్" అని చెప్పాడు అల్లరి నరేష్. 

"ఆయన ఒక న్యూ లుక్ కి నాంది పలికారు మీరు..చిన్నప్పటి నుంచి మీకు కేసెస్, లా ఇలాంటివి ఇష్టమా.."అని డైరెక్టర్ విజయ్ ని అడిగేసరికి "సొసైటీలో ఒక పోలీస్ ఆఫీసర్, లాయర్ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది..పోలీస్ ఆఫీసర్ లేకపోతే మనం లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయలేము. అందుకే హీరో రోల్ కాప్ రోల్ ఐతే బాగుంటుంది..ఏ ప్రాబ్లమ్ ఐనా క్లియర్ చేయడం కోసం అనుకున్న ఐడియా లోంచి వచ్చిందే ఈ రోల్ " అని చెప్పాడు. "నరేష్ గారితో బ్యాక్ టు బ్యాక్ టు ఫిలిమ్స్ చేశారు. కొత్తవాళ్లతో చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా?" అని తన గురించి ఇండైరెక్ట్ అడిగేసరికి "కొత్తవాళ్లతో చేయాలనుకుంటున్నా కానీ నువ్వు ఆల్రెడీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చేసావుగా ప్రదీప్" అనేసరికి నోటమాట రాలేదు. 

"మిర్న ..ఈ బ్యూటిఫుల్ టీమ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది" అనేసరికి "ఈ జర్నీ చాలా అమేజింగ్ గా అనిపించింది. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నా రోల్ ఇందులో టిపికల్ గా ఉంటుంది. నరేష్ గారు చాలా అద్భుతంగా చేశారు ఈ మూవీలో. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పింది. "అంత అద్భుతమైన యాక్షన్ కి మ్యూజిక్ తోడైతే ఇక ఆ మూవీ చాలా బాగుంటుంది. ఈ ఫిలింకి వర్క్ చేయడం ఎలా అనిపించింది" అని శ్రీచరణ్ ని అడిగాడు ప్రదీప్. "నాకెప్పుడూ ఒక కోరిక ఉండేది. సాంగ్ వస్తే థియేటర్ దద్దరిల్లాలి. అలాంటి బీట్ సాంగ్స్ ఉండాలి. అలా నా కోరికకు ఈ మూవీ నాంది పలికింది" అని చెప్పాడు.