Read more!

English | Telugu

కర్నాటిక్ సంగీతం యొక్క గొప్పదనం నిన్ను చూస్తేనే తెలిసింది

మంగ్లీ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసి సింగర్ గా మారిపోయింది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదిగింది. చిత్తూరుకు చెందిన మంగ్లీ.. తెలంగాణా యాస మాట్లాడడంలో దిట్ట. బతుకమ్మ పాడి బాగా పాపులర్ అయ్యింది. అలాగే సొంతగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది మంగ్లీ. తనే నిర్మాతగా.. పాటలు రాసుకుని వాటిని పాడుతూ ఉంటుంది. సింగర్ గా మాత్రమే కాదు మరోవైపు నటిగా కూడా మూవీస్ లో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. చెల్లి ఇంద్రావతి చౌహాన్ కూడా మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. 

ఐతే ఇప్పుడు ఇంద్రావతి తన సిస్టర్ గురించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "నీకు జ్వరం ఉన్నా కూడా ఇన్వాల్వ్ అయ్యి  పాట పాడుతున్న తీరు చూస్తుంటే నాకు కూడా కర్నాటిక్ సంగీతాన్ని ఇప్పుడే నేర్చేసుకోవాలన్నంత ఆశ కలుగుతోంది. ఆ సంగీతం యొక్క గొప్పదనం ఏమిటో ఇప్పుడు నా కళ్ళతో చూసాక అర్ధమయ్యింది" అని మంగ్లీ కర్నాటిక్ సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తున్న టైములో  వీడియో తీసి దాన్ని ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకుని ఇలా కాప్షన్ పెట్టుకుంది. మంగ్లీ కూడా ఆ సంగీతాన్ని నేర్చుకోమంటూ తన సిస్టర్ కి సజెస్ట్ చేసింది. మంగ్లీ  భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ పాటలు పాడుతూ ఎంతో మంచి తెచ్చుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. కన్నడలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది. ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి తెరకెక్కుతున్న పాదరాయా అనే పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.