English | Telugu

ఆరియానాకు బ్రెయిన్ లేదు అన్న అమరదీప్

"జానకి కలగలేదు" అనే సీరియల్ ద్వారా రామచంద్రగా అలియాస్ రామాగా ఇన్నోసెంట్ ఫేస్ తో  అమరదీప్ అద్భుతంగా నటించేస్తున్నాడు. ఇందులో కేరెక్టర్ చూస్తే  నిజంగా సుగుణాల రాముడే అన్నట్టుగా అమర్ దీప్ కనిపిస్తాడు. ఇక ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు. ఇకపోతే  కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్ లతో తెలుగులో బాగా ఫేమస్ అయిన నటి తేజస్విని గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఎన్నో షోస్ ఈవెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. అమరదీప్ కొన్ని మూవీస్ లో కనిపించి అలరించాడు. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇద్దరి గురించి వెరైటీగా కామెంట్స్ పెట్టాడు. అందులో మొదట ఆరియానా గ్లోరీ గురించి చెప్పాడు. 

ఆర్జే చైతు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న కాజల్.. ఫ్రెండ్షిప్ కి వేల్యూ లేదన్న శ్రీముఖి

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం బీబీ జోడి కంటెస్టెంట్స్ మస్త్ ఎంటర్టైన్ చేసింది. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో పాటు అవినాష్, హరి, ఫైమా కామెడీ బాగా నవ్వించింది. ఐతే ఇందులో ఆర్జే కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది. బీబీ జోడి టాప్ 5 కంటెస్టెంట్ జోడీస్ ఐన ఆర్జే సూర్య-ఫైమా, అవినాష్-అరియనా, మెహబూబ్-శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్-వాసంతి, ఆర్జే చైతు-ఆర్జే కాజల్ వచ్చారు. లేడీస్ ని, జెంట్స్ ని వేరువేరుగా డివైడ్ చేసి గేమ్స్ ఆడించింది. అందులో రౌండ్ 3 లో "లోపల చాలా ఉన్నాయి దాచాం.." సెగ్మెంట్ లో లేడీస్ గెలిచేసరికి పరివారం బ్యాంకుకి కాజల్ ని పంపించింది హోస్ట్ శ్రీముఖి. ఆమెతో పాటు ఆర్జే చైతు కూడా వెళ్ళాడు. లోపలి వెళ్ళాక కాజల్ బి నంబర్ బాక్స్ తీద్దామనుకుంటే చైతు మాత్రం డి నంబర్ బాక్స్ తీయించాడు. బి నంబర్ బాక్స్ లో 50 వేలు, డి నంబర్ బాక్స్ లో 500 లు ఉన్నాయి. ఇక చైతు మాట విని డి నంబర్ బాక్స్ ని బయటికి తీసుకొచ్చింది కాజల్. చైతు ఇక్కడ చాల స్ట్రాటజీ ప్లే చేసి నీతో డి బాక్స్ తీసుకొచ్చేలా చేసాడు అని శ్రీముఖి చెప్పేసరికి కాజల్ స్టన్ ఐపోయింది.

 ప్రొఫెషనల్ మేకప్ ట్రైనర్ గా కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీకదీపం మోనిత

శోభా శెట్టి ఈ పేరు ఇప్పటికీ ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు కానీ.. కార్తీకదీపం సీరియల్లో మోనిత పేరు సీరియల్ ఐపోయినా కూడా ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది.. డాక్టర్ బాబు వంటలక్క ఏ రేంజ్ లో అయితే పాపులర్ అయ్యారో.. మోనిత కూడా అదే రేంజ్ లో పేరు సంపాదించుకుంది.. ఇక ఈ సీరియల్ లో విలన్ రోల్ లో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది. ఐతే కార్తీక దీపం సీరియల్ ఐపోయాక డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఏం చేస్తున్నారో అనుకుంటున్నారు చాలామంది. ఈ ట్రయాంగిల్ రోల్స్ కలిసి ఎప్పుడు నటిస్తారో లేదో తెలీదు కానీ ప్రస్తుతం వీళ్లంతా వీళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ తన స్టూడియోలో డబ్బింగ్స్ చెప్తూ స్పెషల్ ప్రాజెక్ట్స్ చేస్తూ అప్పుడప్పుడు కొత్త కొత్త లొకేషన్స్ కి వెళ్లి ఛిల్ల్ అవుతూ ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తోంది.

అఖిల్ సార్థక్ ని ముద్దు పెట్టుకున్న ముమైత్ ఖాన్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ 4 ఎంట్రీతోనే ప్రేక్షకులకు దగ్గరై ఫేమ్  సంపాదించుకున్నడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు.. 'నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో' అని అన్నట్లుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.

మీరంతా పిడకలే అంటూ పరువు తీసిన ఆది

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. స్లోగా ఆడియన్స్ మధ్యకు వచ్చి హిట్ కొట్టిన మూవీ "బలగం"ని స్పూఫ్ గా తీసుకుని ఈ షో చేశారు. ఐతే ఆది వాళ్ళ తాత చనిపోయాడు కానీ కాకి వచ్చి పిండం తినడం లేదు అని తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిపించి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. ఇక రష్మీ, ఇంద్రజ కూడా మంచి సెగ్మెంట్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని చెప్పి రెడీ అయ్యారు. ఈ కార్యక్రమానికి కొంతమంది దూరపు బంధువులు వస్తున్నారంటూ "లవ్ యు రామ్" మూవీ టీం వచ్చింది. ఇక టీమ్ మొత్తాన్ని చూపించాక "ఏమంటారు ఆది గారు" అని రష్మీ అడిగేసరికి "నేనేమంటాను హీరోయిన్ బాగుంది అంటాను" అని కౌంటర్ వేసాడు. ఇంక ఇంద్రజ ఈ మూవీ టీంకి విషెస్ చెప్పింది. చిన్నప్పుడు తాత కోసం అంత్యాక్షరి ఆడాం..ఇప్పుడు కూడా ఆడదాం అని చెప్పేసరికి రష్మీ రెండు టీమ్స్ గా కమెడియన్స్ ని డివైడ్ చేసి ఆడించింది. ఇక రష్మీ వెరైటీ పదాలు ఇచ్చి ఆ పదాలు పాటలో ఎక్కడైనా రావాలి అని చెప్పి ఈ గేమ్ ఆడించింది. "చామంతి, రోజా" మీద పాటలు పాడారు. "మా అన్నయ్య తాగుబోతు రమేష్ పాడిన రోజా సాంగ్ వాయిస్ విన్న మా తాతయ్య చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోయాడు" అన్నాడు ఆది. తర్వాత "తమలపాకు, మేకు, బోకు, ఫుస్కి, హేయ్య టుర్, పిడక, పుడక, ఏయ్ ఆ, ములక్కాయ, మువ్వా, లవంగం, కుంకుడుకాయ, బాల్, ఆకు, డీజల్" ఇలాంటి పదాల మీద సాంగ్స్ కి ఖూనీ చేసి మరీ పాడి వినిపించారు. పిడక మీద బులెట్ భాస్కర్ " పిడక పిడక పిడక, నీకు పైనా, కింద కొడతాను పిడక, నీ తలా రంగు పిడక, జడ రంగు పిడక, నీ బొట్టు రంగు పిడక" అని పాట పడేసరికి  ,