Read more!

English | Telugu

 ప్రొఫెషనల్ మేకప్ ట్రైనర్ గా కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీకదీపం మోనిత

 

శోభా శెట్టి ఈ పేరు ఇప్పటికీ ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు కానీ.. కార్తీకదీపం సీరియల్లో మోనిత పేరు సీరియల్ ఐపోయినా కూడా ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది.. డాక్టర్ బాబు వంటలక్క ఏ రేంజ్ లో అయితే పాపులర్ అయ్యారో.. మోనిత కూడా అదే రేంజ్ లో పేరు సంపాదించుకుంది.. ఇక ఈ సీరియల్ లో విలన్ రోల్ లో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది. ఐతే కార్తీక దీపం సీరియల్ ఐపోయాక డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఏం చేస్తున్నారో అనుకుంటున్నారు చాలామంది. ఈ ట్రయాంగిల్ రోల్స్ కలిసి ఎప్పుడు నటిస్తారో లేదో తెలీదు కానీ ప్రస్తుతం వీళ్లంతా వీళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ తన స్టూడియోలో డబ్బింగ్స్ చెప్తూ స్పెషల్ ప్రాజెక్ట్స్ చేస్తూ అప్పుడప్పుడు కొత్త కొత్త లొకేషన్స్ కి వెళ్లి ఛిల్ల్ అవుతూ ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తోంది.

ఇక డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల మాత్రం బుల్లితెరలో షోస్, ఈవెంట్స్ లో చేస్తూనే కొత్త సీరియల్ "రాధకు నీవెరా ప్రాణం" సీరియల్ ద్వారా ఆడియన్స్ ముందుకు పోలీస్ బాబులా రాబోతున్నాడు. అప్పుడప్పుడు ఇంట్లో పూజలు, పునస్కారాలు చేస్తూ వాటి వీడియోస్ ని తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఆడియన్స్ అటెంషన్ ని తన వైపు మళ్లించుకుంటున్నాడు. ఇక మోనిత ఏం చేస్తోంది అనుకుంటున్నారా. మేకప్ క్లాసెస్ తీసుకుని ఇంటరెస్ట్ ఉన్న వాళ్లకు మేకప్ ఎలా చేసుకోవాలో చెప్తోంది. సెల్ఫ్ మేకప్ క్లాసెస్ ని నిర్వహిస్తోంది. ఇందులో ఐమేకప్, పార్టీ మేకప్, ఒక్కషన్ మేకప్ తో ఒక హెయిర్ స్టైల్ కూడా నేర్పిస్తోంది. అలాగే ప్రొఫెషనల్ మేకప్ క్లాసెస్ ని కూడా ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు చెప్తోంది. అందులో భాగంగా  శారీ డ్రెపింగ్, నేషనల్ తో ఇంటర్నేషనల్ హెయిర్ స్టైల్స్,  ఫోటో సెషన్, ఫ్లవర్ మేకింగ్ వంటివి నేర్పించి మేకప్ ఆర్టిస్ట్ గా సర్టిఫికెట్ కూడా ఇస్తోంది మోనిత. నేర్చుకోవాలనే ఇంటరెస్ట్ ఉంది డబ్బులు కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారిలో ఒకరికి ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తోంది. లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్ గానే ఉంటాను, దాంతో పాటు ఈ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను అని చెప్పింది. ఇది కేవలం శోభాశెట్టి మేకప్ స్టూడియో..దీని ద్వారా తానే  ట్రైనింగ్ ఇస్తాను అని కూడా చెప్పింది. తన మేకప్ ట్రైనింగ్ కి సంబంధించిన వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.