Read more!

English | Telugu

ఆరియానాకు బ్రెయిన్ లేదు అన్న అమరదీప్

"జానకి కలగలేదు" అనే సీరియల్ ద్వారా రామచంద్రగా అలియాస్ రామాగా ఇన్నోసెంట్ ఫేస్ తో  అమరదీప్ అద్భుతంగా నటించేస్తున్నాడు. ఇందులో కేరెక్టర్ చూస్తే  నిజంగా సుగుణాల రాముడే అన్నట్టుగా అమర్ దీప్ కనిపిస్తాడు. ఇక ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు. ఇకపోతే  కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్ లతో తెలుగులో బాగా ఫేమస్ అయిన నటి తేజస్విని గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఎన్నో షోస్ ఈవెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. అమరదీప్ కొన్ని మూవీస్ లో కనిపించి అలరించాడు. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇద్దరి గురించి వెరైటీగా కామెంట్స్ పెట్టాడు. అందులో మొదట ఆరియానా గ్లోరీ గురించి చెప్పాడు. 

"స్టేషన్ లో ఉంటది ట్రైను..నా బెస్టీకి లేదు బ్రెయిను" అంటూ అరియానాకు బ్రెయిన్ లేదు అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పాడు. అలాగే మరో ఫ్రెండ్ యశ్వంత్ గురించి "సముద్రం ఉంటుంది లోతు...నా ఫ్రెండ్ దున్నపోతు" అంటూ తన ఫ్రెండ్ ని తిట్టాలనుకుని ఇలా తిట్టేసాడు. అమర్ దీప్, అరియానా గ్లోరీ మంచి క్లోజ్ ఫ్రెండ్స్.. వీరి మధ్య మంచి బాండింగ్ ఉండటంతో అరియానా అమర్ దీప్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. కృష్ణార్జున యుద్ధం, శైలజరెడ్డి అల్లుడు, సారధి, ఎవరు వంటి  మూవీస్ లో కూడా నటించాడు అమరదీప్. 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో బుల్లితెర  ఆడియన్స్ కి  సెకండ్ హీరోగా పరిచయమై 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు.