Read more!

English | Telugu

నీ ఫస్ట్ నైట్ నాతో గడుపుతున్నావ్ అన్న ఏవీఎస్!

టాలీవుడ్ లో  స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్  హోస్ట్  'అలా మొదలైంది'  సెలబ్రిటీ టాక్ షోలో ప్రతీ వారం కూడా ఆడియన్స్ ని తనదైన స్టయిల్లో నవ్విస్తున్నారు. ఇందులో సెలబ్రిటీ కపుల్స్ గెస్ట్ లుగా వస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి చెప్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వాళ్ల భార్యలతో కలిసి ఈ షోలో బోలెడు కబుర్లు చెప్పారు. లేటెస్ట్ గా  సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఈ షోకి వచ్చారు. తన ప్రేమ పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పాడు బ్రహ్మాజీ. "పదేళ్లు కలిసి తిరిగాం కానీ నాకు బుర్ర తక్కువ కాబట్టి బ్రహ్మాజీకి నేనంటే ఇష్టం అన్న విషయాన్ని గ్రహించలేకపోయాను..ఆ విషయాన్నీ మా కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఆ యాంగిల్ చూడడం స్టార్ట్ చేసాను" అని చెప్పింది శాశ్వతి. 

"1998 ఏప్రిల్ లో మేము చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం ఆ తర్వాత 13 మేలో మా పెళ్లి ఆర్య సమాజ్ లో అయ్యింది" అని చెప్పింది. "మేము ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి పెద్దలు కృష్ణవంశీ, రమ్యకృష్ణ. ఆ టైములో "చంద్రలేఖ" మూవీ షూటింగ్ లో ఉన్నాం అందుకే టీం అంతా ఉదయం 8 గంటలకే వచ్చేసారు. మా పెళ్లి రోజున నాగార్జున గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఆయన అప్పటికి అబ్రాడ్ లో ఉన్నారు. మా పెళ్లి ఆ టైములో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు" అని చెప్పాడు బ్రహ్మాజీ. "ఈ పెళ్ళికి నందినీరెడ్డి టీం కూడా అప్పుడు మా పెళ్ళికి వచ్చారు. అన్నీ వాళ్ళే ఏర్పాట్లు చేశారు. మేము అలా వెళ్లి పెళ్లి చేసుకున్నాం అంతే..నా పెళ్లి బ్లౌజ్ కూడా రమ్యకృష్ణ వాళ్ళ టైలర్ తో చెన్నైలో కుట్టించి పంపించారు. ఐతే మా పెళ్లికి అందరూ అలిసిపోయి చెమటలు కక్కుతూ ఉన్నారు. ఆ టైంకి  బ్రహ్మాజీ మోహన్ బాబుగారి మూవీ కూడా చేస్తున్నారు. అప్పుడు అనంతపురం వెళ్లాల్సి ఉంది. ఇక్కడ పెళ్లి బట్టలు మార్చేసుకుని అలా కార్ లో షూటింగ్ కి వెళ్ళిపోయాడు" అని చెప్పింది శాశ్వతి. "అవును అప్పటికే మోహన్ బాబు గారి నుంచి షూటింగ్ కి ఎప్పుడొస్తున్నావ్ అంటూ  ఫోన్ వచ్చింది. ఐతే నా పెళ్లి విషయం చెప్పాను..పెళ్లి చేసుకుని రా అన్నారు.

అప్పటికే అవుట్ డోర్ లో నా కోసం చాలామంది వెయిటింగ్ లో ఉన్నారు. అక్కడ నాకు ఏవిఎస్ గారు నా రూమ్ మేట్. ఆయన అప్పుడు ఒక మాట అన్నారు. నీ ఫస్ట్ నైట్ నాతో గడుపుతున్నావ్ "అన్నారని చెప్పాడు బ్రహ్మాజీ. "మరి హనీమూన్ కి వెళ్ళారా తర్వాత" అని కిషోర్ అడిగేసరికి "లేదు ఎక్కడికి వెళ్ళింది..షూటింగ్ పూర్తి చేసుకుని మూడు రోజుల తర్వాత వచ్చాడు" అని చెప్పింది శాశ్వతి.ఇక బ్యాక్ గ్రౌండ్ లో బ్రహ్మాజీ పెళ్లి ఫోటోలు ప్లే చేశారు. అందులో రవితేజ, శివాజీ రాజా, రాంజగన్, నందినీ రెడ్డి ఉన్నారు.