Read more!

English | Telugu

కాకిని తీసుకుపోయిన ‘బలగం’ మూవీ డైరెక్టర్!

శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్స్ అంతా ఈ వారం కాకి కోసం ఎంతో వెయిట్ చేశారు. ఒక్కో సెగ్మెంట్ చేస్తూ కాకిని పిలుస్తూనే ఉన్నారు. ఇక కోపం వచ్చిన ఆది "మీరేదో చేస్తారు అనుకుని పిలిపించాం..కాకులు కాదు కదా ఈగలు కూడా రాలేదు" అని రష్మిని అడిగేసరికి కోపం వచ్చిన రష్మీ "నిమిష నిమిషానికి ఎవరో ఒకరు పోతూ ఉంటారు. మరి అలాంటి టైంలో కాకులు ఎక్కడెక్కడికో వెళ్ళాలి కదా మీకోసం వెయిటింగ్ లో ఉంటాయా ఏమిటి.. ఆగండి.. కంగారెందుకు..మీ దగ్గరకు కాకిని పిలవడానికి కాకుల స్పెషలిస్ట్ ఉన్నాడు" అని చెప్తూ రాకెట్ రాఘవని స్టేజి మీదకు పిలిపించింది. "కాకులను రెంట్ కి ఇస్తాం" అని అరుస్తూ వచ్చాడు రాఘవ. "కాకుల్ని రెంట్ కి ఇవ్వడం ఏమిటి" అని అడిగేసరికి "ఎంతసేపు పెళ్లిళ్లు, షామియానాలేనా, అప్పుడప్పుడు కర్మలు జరిగే టైములో పిండాలు తినడం కోసం కాకుల్ని కూడా రెంట్ కి ఇస్తూ ఉంటాం" అని చెప్పాడు. 

ఇంతకు మీ కాకి స్పెషాలిటీ ఏమిటి ? " అని ఆది అడిగేసరికి "ఎక్కడైనా ఫుడ్ పెడితే కాకి తినేసి వెళ్ళిపోతుంది. కానీ మేము ట్రైనింగ్ ఇచ్చిన కాకి మాత్రం అలా కాదు భోజనం చేసి, పాన్ వేసుకుని, ఆశీర్వదించి మరీ వెళ్తుంది" అని చెప్పాడు రాఘవ. ఆ మాటకు జిత్తు వచ్చి "ఇంతకు స్వీట్ పానా, బాబా రత్న పానా" అని డౌట్ అడిగేసరికి "జపాన్ అయ్యా" అని కౌంటర్ వేసాడు రాఘవ. మా దగ్గర ఉన్నది అలాంటి ఇలాంటి కాకి కాదు. బలగం మూవీ డైరెక్టర్ వచ్చి మా కాకిని తీసుకెళ్లారు. మూవీలో ఈ కాకిని పెట్టేసరికి మూవీ సూపర్ డూపర్ హిట్ ఐపోయింది. కాకి అరుస్తూ ఉంటే "ఛి కాకిగోల" అని తిట్టుకుంటారు. కానీ ఈ కాకి చేసే సేవలకు అప్పట్లో ఒక ఊరికి దీని పేరును పెట్టారు అదే "కాకినాడ" అనేసరికి అందరూ నవ్వేశారు. అదేంటి కాకిని రెంట్ కి ఇవ్వడం కోసం ఊరు పేరే మార్చేస్తావా అని జిత్తు అనేసరికి "పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా..హంసలా ఆరు నెలలు బతికే కంటే కాకిలా కలకాలం బతకమన్నారు" అన్నాడు రాఘవ. ఎవరైనా ఏమనుకుంటారు  అమ్మా నాన్నే తినమని మనల్ని అడుగుతారు కానీ కాకి కూడా అడుగుతుంది తెలుసా..కాకి నేషనల్ భాషకు రెస్పెక్ట్ ఇస్తూ ఖావో, ఖావో అని చెప్తూ ఉంటుంది.. ఈ కాకి చేసే సేవకు ఇంకో గుర్తింపు కూడా ఉంది. తెలుగు భాషలో దీనికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు . క గుణింతాన్ని కాకితోనే కదా మొదలు పెట్టింది. అని చెప్పాడు. తర్వాత ఏదో గుర్తొచ్చినవాడిలా "మా కాకి ఈరోజు ఉపవాసం అండి మర్చిపోయాను..కావాలంటే నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాను. అప్పుడు తింటుంది లెండి" అని చెప్పాడు రాఘవ. "మీరేదో స్పెషలిస్టులు అది ఇది అన్నారు మరేం లేదు ఇక్కడ" అని రష్మీ మీద కోప్పడతారు. దానికి ఇంద్రజ "కాకిని ఇలా ట్రైనింగ్ ఇచ్చి తినిపించకూడదు. దానంతట అదే వచ్చి తినాలి అని చెప్పి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ పెట్టిద్దాం" అని చెప్పింది. అలా "లవ్ యు రామ్" మూవీ హీరో వచ్చి స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసాడు.