Read more!

English | Telugu

మీరంతా పిడకలే అంటూ పరువు తీసిన ఆది

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. స్లోగా ఆడియన్స్ మధ్యకు వచ్చి హిట్ కొట్టిన మూవీ "బలగం"ని స్పూఫ్ గా తీసుకుని ఈ షో చేశారు. ఐతే ఆది వాళ్ళ తాత చనిపోయాడు కానీ కాకి వచ్చి పిండం తినడం లేదు అని తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిపించి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. ఇక రష్మీ, ఇంద్రజ కూడా మంచి సెగ్మెంట్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని చెప్పి రెడీ అయ్యారు. ఈ కార్యక్రమానికి కొంతమంది దూరపు బంధువులు వస్తున్నారంటూ "లవ్ యు రామ్" మూవీ టీం వచ్చింది. ఇక టీమ్ మొత్తాన్ని చూపించాక "ఏమంటారు ఆది గారు" అని రష్మీ అడిగేసరికి "నేనేమంటాను హీరోయిన్ బాగుంది అంటాను" అని కౌంటర్ వేసాడు. ఇంక ఇంద్రజ ఈ మూవీ టీంకి విషెస్ చెప్పింది. చిన్నప్పుడు తాత కోసం అంత్యాక్షరి ఆడాం..ఇప్పుడు కూడా ఆడదాం అని చెప్పేసరికి రష్మీ రెండు టీమ్స్ గా కమెడియన్స్ ని డివైడ్ చేసి ఆడించింది.

ఇక రష్మీ వెరైటీ పదాలు ఇచ్చి ఆ పదాలు పాటలో ఎక్కడైనా రావాలి అని చెప్పి ఈ గేమ్ ఆడించింది. "చామంతి, రోజా" మీద పాటలు పాడారు. "మా అన్నయ్య తాగుబోతు రమేష్ పాడిన రోజా సాంగ్ వాయిస్ విన్న మా తాతయ్య చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోయాడు" అన్నాడు ఆది. తర్వాత "తమలపాకు, మేకు, బోకు, ఫుస్కి, హేయ్య టుర్, పిడక, పుడక, ఏయ్ ఆ, ములక్కాయ, మువ్వా, లవంగం, కుంకుడుకాయ, బాల్, ఆకు, డీజల్" ఇలాంటి పదాల మీద సాంగ్స్ కి ఖూనీ చేసి మరీ పాడి వినిపించారు. పిడక మీద బులెట్ భాస్కర్ " పిడక పిడక పిడక, నీకు పైనా, కింద కొడతాను పిడక, నీ తలా రంగు పిడక, జడ రంగు పిడక, నీ బొట్టు రంగు పిడక" అని పాట పడేసరికి  ,

ఈ ఎపిసోడ్ కి మీరంతా పిడకలే" అని కౌంటర్ డైలాగ్ వేసాడు ఆది. ములక్కాయ పదం మీద పంచ్ ప్రసాద్ ఎవరూ పాడని ఎప్పుడూ వినని పాట పాడాడు. దానికి రోహిణి "కాకే ముద్ద ముట్టడం  లేదంటే  మీ ముద్ద  ఎవరికి కావాలయ్యా" అని కౌంటర్ వేసింది.  ఇలా వెరైటీ పదాలతో, రష్మీ హస్కీ ఎక్స్ప్రెషన్స్ తో ఈ అంత్యాక్షరి సెగ్మెంట్ పూర్తి చేశారు కమెడియన్స్. కొత్త కొత్త సాంగ్స్ సృష్టించారు, హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేశారు అంటూ పొగిడింది యాంకర్ రష్మీ. ఈ సెగ్మెంట్   లో మా వైపు  నుంచి  పంచ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ టీమ్ నుంచి  జిత్తు బాగా ఆడారని  చెప్పాడు  హైపర్  ఆది. ఇక ఇంద్రజ మాట్లాడుతూ  " ఈ సెగ్మెంట్ చూసి  నవ్వలేక  కడుపు  నొప్పి  వచ్చేసింది , మనమంతా  సెలబ్రిటీస్, ఆడియన్స్ మనల్ని  ఒక రేంజ్ లో చూస్తారు . వాళ్ళు  ఈ సెగ్మెంట్ ఒక్కటి  చూస్తే  చాలు మన  ఇమేజ్  మొత్తాన్ని మార్చేయడానికి . మీరు  ఇన్ని  పాటలు పాడినా  కాకి మాత్రం రాలేదు  అని రష్మీ ఫీల్ అయ్యి  కమెడియన్స్ ని వాళ్ళ ప్లేసెస్ కి వెళ్లి  కూర్చోమని  చెప్పింది.