English | Telugu

‘స్కంద’ కలెక్షన్స్‌.. ఎలా చూసినా బ్రేక్‌ ఈవెన్‌ కష్టం!!

ఇస్మార్ట్‌ శంకర్‌తో ఫుల్‌ మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న రామ్‌ పోతినేని, యాక్షన్‌, మాస్‌ సినిమాల స్పెషలిస్ట్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘స్కంద’ ఇటీవల విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది అనగానే ప్రేక్షకుల్లో, రామ్‌ అభిమానుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. అయితే అందరూ ఊహించినట్టు ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వలేదు. ఈ సినిమా విడుదలై 5 రోజులైంది. ఈ ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏరియా వైజ్‌ కలెక్షన్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

నైజాం రూ.9.27 కోట్లు, సీడెడ్‌ రూ.3.26 కోట్లు, వైజాగ్‌ రూ.2.85 కోట్లు, ఈస్ట్‌ రూ.1.69 కోట్లు, వెస్ట్‌ రూ.1.11 కోట్లు, కృష్ణా రూ.1.21 కోట్లు, గుంటూరు రూ.2.22 కోట్లు, నెల్లూరు రూ.99 లక్షలు.
5 రోజుల టోటల్‌ షేర్‌ రూ.22.6 కోట్లు.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ బాగా జరిగింది. అంటే చాలా హై రేట్లకి ఈ సినిమాని అమ్మారు కాబట్టి ఐదు రోజులకు బ్రేక్‌ ఈవెన్‌ అవ్వలేదు. దీనికి ముందు రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ తక్కువ రేట్లకే జరిగింది. ఈ సినిమా ఐదు రోజులకు టోటల్‌గా రూ.25 కోట్లు కలెక్ట్‌ చేసింది. అమ్మిన రేట్లతో కంపేర్‌ చేస్తే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రూ.25 కోట్లకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. ఇక ‘స్కంద’ గురించి చెప్పాల్సివస్తే.. రూ.47 కోట్లు షేర్‌ సాధిస్తే తప్ప బ్రేక్‌ ఈవెన్‌ అవ్వదు. ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్‌ బట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవ్వడం కూడా కష్టమేనని అర్థమవుతోంది. ఎలా చూసినా రామ్‌, బోయపాటి శ్రీనుల ‘స్కంద’ హీరో, డైరెక్టర్‌లతోపాటు నిర్మాతకు కూడా సేఫ్‌ ప్రాజెక్ట్‌ కాదు అనేది నిజం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.