English | Telugu
పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్‌కి ఎన్టీఆర్ సహాయం!
Updated : Oct 4, 2023
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ప్రెస్టీజియస్‌గా భావించి చేసిన ఓ సినిమా అసలు ఆయన కెరీర్‌లోనే ఊహించని డిజాస్టర్ అయ్యింది. నిర్మాతకు చాలా పెద్ద నష్టాలే వచ్చాయి. అయితే ఆయన దానిపై ఎక్కడా ఎప్పుడూ కామెంట్స్ చేయలేదు. రీసెంట్ జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మూవీ వల్ల ఏర్పడిన నష్టాల బారి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన సపోర్ట్‌తో బయట పడ్డానని మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వల్ల అంత రేంజ్‌లో ఎఫెక్ట్ అయిన నిర్మాత ఎవరో కాదు.. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు. ఆ సినిమా మరేదో కాదు.. అజ్ఞాతవాసి.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రమిది. పవన్ నటించిన 25వ సినిమా కావటంతో సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. అంతకు ముందు జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలను సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే హోప్‌తో అజ్ఞాతవాసిపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో ఆ నష్టాలను నిర్మాతలే కొంత మేరకు భరించారు కూడా. అయితే సినిమా వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవటానికి నిర్మాతలకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో వారికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండగా నిలబడ్డారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తదుపరి అరవింద సమేత వీరరాఘవ అనే మూవీ చేశారు. ఆ సినిమా డిస్కషన్ సమయంలో నిర్మాత గురించి తెలిసిన ఎన్టీఆర్ ఇదే ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేద్దాం. కచ్చితంగా హిట్ కొడుతున్నాం అని చెప్పటమే కాకుండా సినిమాకు పూర్తి సపోర్ట్ చేయటంతో సినిమాను అనుకున్న సమయంలోనే రిలీజ్ చేశారు నిర్మాతలు. ఎన్టీఆర్ చెప్పినట్లే మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.