హరీష్ రావుది దింపుడు కళ్లెం ఆశేనా?!
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకల వ్యవహారంలో బీఆర్ఎస్ గాభరా పడుతోంది. భయపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కంగారు పడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులను బెంబేలెత్తిస్తోంది.