వరద బాధిత జిల్లాల్లో సిఎం ఏరియల్ సర్వే!
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే చేయనున్నారు. కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వర్షాలపై తన జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.