English | Telugu

ఆక్టోబర్ లేదా నవంబర్‌లో జూబ్లీ‌ ఉప ఎన్నిక : కిషన్‌రెడ్డి

దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో ఏర్పడిన జూబ్లీ‌హిల్స్ అసెంబ్లీ స్ధానానికి ఆక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోంది. బీసీల ఓట్లు అడిగి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేశానే జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికకు వెళ్లాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని కేంద్ర మంత్రి తెలిపారు.

ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లు జూబ్లీహిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, పాయల్ శంకర్‌తో పాటు గౌతమ్ రావు, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డిలకు అవకాశం కల్పించారు.