కేసీఆర్, హరీష్ కు హైకోర్టులో చుక్కెదురు
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు గానీ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కానీ హైకోర్టు నిరాకరించింది.