English | Telugu

అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ వద్దు..హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్

పీసీ ఘోష్ క‌మిష‌న్ కమీషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను శాసన సభలో ప్రవేశ పెట్టొద్దని కోరుతూ తెలంగాణ హైకోర్టులో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్‌రావు హౌస్ మోషన్‌ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.


ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వారు అనుమతినివ్వడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హరీష్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించి, తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలలపాటు విచారణ జరిపిన పీసీఘోష్ కమిషన్.. జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందించింది.

ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు బాధ్యులని తేలడంతో.. అసెంబ్లీలో చర్చించి.. అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారని లేదని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది