కాళేశ్వరంలో కేసీఆర్ ను నిండా ముంచేసిన కవిత వ్యాఖ్యలు!?
కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరగలేవని బీఆర్ఎస్ ఎంతగా గొంతు చించుకుని అరిచినా ఫలితం లేకుండా పోయే పరిస్థితిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ లపై ఆరోపణలు ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారం వాస్తవమేనని కవిత కుండ బద్దలు కొట్టేశారు.