మీరు పెళ్లి తప్ప అన్ని చేసుకుంటారు.. అదేంటో?
ఏ పండగైనా, ఏ వ్రతం ఐనా భార్య భర్తలు కుటుంబం అంతా కలిసి చేసుకోవడం ఆనవాయితీ. కానీ కొంతమందికి మాత్రం అలా ఏమీ ఉండదు..పెళ్లి కాకుండా కలిసి వ్రతాలు, పూజలు చేసేస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ బుల్లితెర సెలబ్రిటీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రియాంక జైన్, శివ్ కుమార్ విషయంలో అలాగే జరిగింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా కామెంట్స్ చెయ్యట్లేదు. బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర హీరోయిన్ ప్రియాంక జైన్ వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.