English | Telugu

ముఖేష్ గౌడ నిర్మాణంలో కొత్తగా చిత్రం..పేరు మార్చుకున్న రిషి సర్

గుప్పెడంత మనసు హీరో ముఖేష్ గౌడ తన ఫాన్స్ కి లేటెస్ట్ అప్ డేట్ చెప్పాడు. తన సినిమా టైటిల్‌‌ని రివీల్ చేశారు.‘‘ప్రతి కొత్త ప్రారంభం మన మీద మరింత బాధ్యతను పెడుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున.. చాముండేశ్వరి ఆశీర్వాదంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. నా కొత్త సినిమా పేరు ‘తీర్థరూప తాండేయవారిగే’. తెలుగులో ‘ప్రియమైన నాన్నకు’ అనే టైటిల్ తో మీ ముందుకు రాబోతున్నాను. నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. దీంతో కొత్త జర్నీ ప్రారంభమైంది. ఇందులో మీరంతా భాగమైనందుకు ధన్యవాదాలు.

జై చాముండేశ్వరి’’ అంటూ తనకి ఎంతో ఇష్టమైన చాముండేశ్వరి దేవి ఆశీస్సులతో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ. ఈ మూవీ షూటింగ్ కారణంగానే గుప్పెడంత మనసు సీరియల్ లో కొన్ని రోజులు కనిపించలేదు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్‌లో ముఖేష్ గౌడనే నిర్మిస్తున్నాడు. 2025 సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి రిషి తన స్క్రీన్ నేమ్ ని రివీల్ చేశారు. తన పేరుని నిహర్ ముఖేష్ బిగా మార్చుకున్నాడు. ఇక మూవీలో కనిపించబోతున్న రిషి సర్ కి అభిమానులంతా కంగ్రాట్స్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.