English | Telugu

అనసూయ చేతులు నొక్కుతూ.. కోరిక బయటపెట్టిన శేఖర్ మాస్టర్


కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో మాములుగా మాట్లాడినా చాలు అవి బూతులైపోతున్నాయి. ఈ వారం సెమి ఫినాలేకి దగ్గరయింది ఈ షో. ఐతే ఇందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. అది శేఖర్ మాస్టర్ చాలా కరెక్ట్ గా పూర్తి చేసి విన్ అయ్యాడు. అనసూయ ఓడిపోయింది. ఐతే శేఖర్ మాష్టర్ బాధపడుతూ నిన్నే గెలిపిద్దామనుకున్నా అనసూయ అనేసరికి పర్లేదు మాష్టర్ బాగా ఆడారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఎలా ఉన్నాయి మాష్టర్ అని రొమాంటిక్ గా అడిగింది అనసూయ. దానికి శేఖర్ మాష్టర్ వదలబుద్ది కావడం లేదు అని చెప్పేసరికి అందరూ అరిచారు. తర్వాత మళ్ళీ అనసూయ "నా కోసమో ఎవరి కోసమో కాదు ప్రేరణ అటొస్తే టఫ్ కాంపిటీషన్ బాగుంటుందేమో అని అనుకుంటున్నా అని చెప్పింది. సరే మరి నేను ఏది అడిగితె అది ఇస్తావా నువ్వు ..అది కూడా బయటకు చెప్పను చెవిలో చెప్తాను" అని శేఖర్ మాష్టర్ అన్నాడు .

తర్వాత దీపికా రంగరాజు-యాదమ్మ రాజు కలిసి హ్యాండ్ రెజ్లింగ్ చేస్తున్నప్పుడు యాదమ్మ రాజునూ ఇంకో బుల్లితెర నటి వచ్చి వెనక నుంచి హగ్ చేసుకుంది. అది చూసిన శ్రీముఖి "ఆమె హగ్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఫీలింగ్స్ కలిగాయా" అని "వచ్చాయనుకో" అన్నాడు యాదమ్మ. దానికి అనసూయ "కెమెరా ముందే ఇంత అయ్యింది అంటే కెమెరా వెనకాల" అని శేఖర్ మాష్టర్ కూడా కామెంట్ చేసాడు. తర్వాత కొన్ని టాస్కుల్లో లేడీస్ సరిగా చేయలేకపోయారు. దాంతో శేఖర్ మాష్టర్ - విష్ణుప్రియ - సౌమ్య రావు మధ్యలో మాటల యుద్ధం జరిగింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.