English | Telugu

Karthika Deepam 2 : కనిపెట్టేసిందా స్వప్న.. కావేరీ డౌట్ నిజమేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2 '(karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -126 లో.... దాస్ పారిజాతం దగ్గరికి వస్తాడు. అతనికి తన కూతురు బ్రతికే ఉందన్న విషయం తెలియదని పారిజాతం అనుకుంటుంది కానీ ఆ విషయం నాకు తెలుస.. నాకు తెలుసన్న విషయం నీకు తెలియదు అమ్మ అని దాస్ అనుకుంటాడు. నాకు నా కూతురుని చూడాలని ఉందని దాస్ అనగానే పారిజాతం షాక్ అవుతుంది. నీ కూతురు ఎక్కడ ఉంది చనిపోయింది కదా అని పారిజాతం అంటుంది. అంటే దశరత్ అన్నయ్య కూతురు కూడా నీకు మనవరాలు అవుతుందంటే నాకు కూతురు అవుతుంది కదా అంటు దాస్ కవర్ చేస్తాడు.

అ తర్వాత తనని చూస్తానంటూ దాస్ లోపలికి వెళ్లి..‌ జ్యోత్స్న అంటూ పిలుస్తాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. దాస్ ని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇతనేంటి ఇక్కడ అని అనుకుంటుంది. ఏంటి ఈ అమ్మయి నా కూతురా అని దాస్ అనుకుంటాడు. అప్పుడే దశరత్ సుమిత్రలు వస్తారు. దాస్ ని చూసి బాగున్నావా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని అడుగుతారు. అ తర్వాత అతను పారిజాతం కొడుకు అన్న విషయం జ్యోత్స్నకి తెలుస్తుంది. భోజనం చేస్తూ మాట్లాడుకుందామని దశరత్ అనగానే అప్పుడే శివన్నరాయణ వస్తాడు. వాడిని ఎందుకు రానిచ్చారంటూ కోప్పడుతాడు. తన మీద శివన్నారాయణ కోపం చూసిన జ్యోత్స్న.. ఇతను ఏదో తప్పు చేసినట్లున్నాడు. అందుకే ఇన్ని రోజులు దూరం పెట్టారని జ్యోత్స్న అనుకుంటుంది.

అ తర్వాత ఇంట్లో నుండి వెళ్తావా మెడపట్టుకొని బయటకు గెంటేయ్యమంటావా అని శివన్నారాయణ అంటాడు. దాంతో దాస్ బయటకు వెళ్తాడు. నీ వల్లే వచ్చినట్లు ఉంటే ఇంకెప్పుడు ఇలా రానివ్వకంటూ శివన్నారాయణ పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. అ తర్వాత దాస్ బయటున్న శౌర్యని చూస్తాడు. కుబేర్ ఫోటో చూడబోతుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. ఎవరు వాళ్లు అని అడగగా.. వంట మనిషి అని పారిజాతం చెప్తుంది. నిన్ను ఇంత అవమానిస్తున్నా కూడా నేను ఏమన్లేదని పారిజాతం ఫీల్ అవుతుంది. ఎందుకు వచ్చావ్? నీ అడ్రెస్.. ఫోన్ నెంబర్ చెప్పమని పారిజాతం అనగానే జ్యోత్స్న జాగ్రత్త అంటూ వెళ్లిపోతాడు. మరొకవైపు స్వప్న తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే కావేరి వింటుంది. తనకి డౌట్ వచ్చి కావేరి ఫోన్ చూస్తుంటే.. స్వప్న వచ్చి నాపై డౌట్ ఆ అంటూ అడుగుతుంది. ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది. ఇప్పుడు చెప్పొద్దనుకొని ఎవరిని ప్రేమించలేదని అంటుంది. ఆ తర్వాత కావేరి తన జీవితంలాగా నా కూతురు జీవితం అవ్వకూడదు.. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా తనకి దూరంగా ఉంటున్నానని కావేరి అనుకుంటుంది. నాన్న ఎవరితోనో కన్పించాడని స్వప్న అనగానే.. కాంచనని చూసి ఉంటుందని కావేరి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.