English | Telugu

ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుంచి కేశవ్ రామ్ ఎలిమినేట్..

ఇండియన్ ఐడల్ సీజన్ 3  ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఐతే ఇప్పుడు ఈ సీజన్ లో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ ఐపోతున్నారు.   ఐతే ఇంతవరకు తన పాటలతో ఆకట్టుకున్న కేశవ్ రామ్ రీసెంట్ ఎపిసోడ్ లో  ఎలిమినేట్ అయ్యాడు. దాంతో కేశవ్ కి ఉన్న ఫాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు.  కేశవ్ సాంగ్స్ అంటే పడిచచ్చిపోయే ఫాన్స్ చాలామంది ఉన్నారు. ఆయన గాత్రం మృదుమధురంగా ఉంటుంది.  కేశవ్‌కి ముందు,  కుశాల్ శర్మ, హరి ప్రియ, రాంజీ శ్రీపూర్ణిమ, శ్రీధృతి, అభిగ్న, సాయి వల్లభ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్నా ఓట్లు జడ్జ్ ల స్కోర్‌ ఆధారంగా ఈ  ఎలిమినేషన్స్  జరుగుతున్నాయి.

రవితేజ వాళ్ళ అమ్మకు ముకేశ్ గౌడ అంటే చాలా ఇష్టం...

గుప్పెడంత మనసు సీరియల్ కి ఆమె బిగ్ ఫ్యాన్ కూడా నెక్స్ట్ ఇయర్ ముకేశ్ రెండు సినిమాలు రిలీజ్ గుప్పెడంత మనసు సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచి టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లి చివరికి ఎండ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇక ఇందులో హీరో ముకేశ్ గౌడా నటన కానీ అతని ఆటిట్యూడ్ కానీ చాలా కూల్ ఉంటుంది అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు.. దాంతో లేడీ ఫాన్స్ అంతా ఆయన నటనకు ఫిదా ఇపోయారు. ఇక ముకేశ్ గౌడ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. తెలుగు ఆడియన్స్ కి ఒక వ్యక్తి నచ్చితే గనక వాళ్ళ ఇంట్లో అబ్బాయికంటే ఎక్కువగా ఆదరిస్తారు అన్నాడు. అలా తెలుగు వాళ్ళ అభిమానాన్ని పొందడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఇక ముకేశ్ గౌడ నటించిన గీత శంకరం, ప్రియమైన నాన్నకు మూవీస్ రెండు కూడా 2025 లో రిలీజ్ అవుతాయని చెప్పాడు.

Karthika Deepam2 : డాక్టర్ బాబు అనుకుంటున్నావా.. నీ లైఫ్ లో బేబీ ఉందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -133 లో..... దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. చాలా కంగ్రాట్స్ దీప అని జ్యోత్స్న అనగానే ఎందుకని దీప అడుగుతుంది. నేను ఎంతో ఇష్టపడిన వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నావని జ్యోత్స్న అంటుంది. కష్టంలో ఉన్నవాళ్లు అందరు నీకే ఎదరవుతారు అదేంటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నావ్ కదా.. అసలు ఆ వీడియో నువ్వే కావాలని తీయించావ్ .. ఎంతిచ్చావని జ్యోత్స్న అనగానే నువ్వు ఏదో మైండ్ లో పెట్టుకొని ఇలా చేస్తున్నావ్.. ఇలా ఆలోచిస్తే నువ్వు ఇష్టపడేవాళ్ళు దూరం అవుతారని దీప అంటుంది.

Eto Vellipoyindhi Manasu : భర్త కోసం ప్రేమగా వండి తీసుకొచ్చిన భార్య.. ఆమెతో అలా!

​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -185 లో.....నందిని సీతాకాంత్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏంటి అలా చూస్తున్నావ్ పార్టనర్.. మనుషులని మనసులని బాగా స్టడీ చేసిన దాన్ని.. ఇక నుండి మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి..  గతాన్ని కాదు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం.. అప్పుడే కంపెనీ సక్సెస్ అవుతుందని నందిని అంటుంది. ఆ తర్వాత మేనేజర్ వచ్చి ఫైల్ పై సంతకం పెట్టమంటాడు. నందిని మేడమ్ కూడ పెట్టాలని మేనేజర్ అంటాడు. దాంతో నందిని కూడా సంతకం పెడుతుంది. ఇద్దరి సంతకలు పక్కపక్కన ఉండడం చూసి నందిని హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Guppedantha Manasu : కూపీలాగిన శైలేంద్ర.. మహేంద్రని కాపాడిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1163 లో.... ఫణీంద్ర, శైలేంద్రలు మహేంద్ర దగ్గరికి వస్తారు. ఇలా వచ్చారేంటని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషికి బయటకు రా అంటూ శైలేంద్ర సైగ చేస్తాడు. రిషి బయటకు రాగానే నువ్వు రిషివా రంగావా అని అడుగుతాడు. ఎందుకు అలా డౌట్ పడుతున్నారని రిషి అడుగగా.. నేను సరోజని కలిసాను.. నువ్వు  వసుధార నీ ఇంట్లో ఉన్న విషయం ఎందుకు నాతో చెప్పలేదు.. అయినా ఒకసారి ఫోటో చూపించి అడిగితే తెలియదన్నావ్ కదా.. ఎందుకు నాతో అబద్దం చెప్పావని శైలేంద్ర అడుగుతాడు.

ఢీ షో లో అవు డాన్స్...ఆది చూస్తుంటే పడిపోతోంది 

ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా హాట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఉంది. ఆది ఇందులో ఒక మెజీషియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆది ఉంటే వచ్చే బూతులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కుమార్ మాష్టర్ కూడా ఆదికి తోడయ్యాడు. కుమార్ మాష్టర్ ఒక తాడు ఇచ్చి దాన్ని నిలబెట్టమని చెప్పాడు. దాంతో హోస్ట్ నందు మ్యాజిక్ స్టిక్ తీసుకుని ఆ తాడును స్ట్రైట్ గా నిలబెట్టాడు. ఐతే కుమార్ మాష్టర్ మాత్రం ఆది అన్న నువ్వు చూస్తుంటే పడిపోతోంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు.

లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న పునర్నవి..

పునర్నవి అంటే చాలు బిగ్ బాస్ ఇంట్లో రాహుల్‌ సిప్లిగంజ్ తో చేసిన అల్లరి గుర్తొస్తుంది. ఆమె చిన్న చిన్న పాత్రలు చేసి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక పునర్నవి ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ బ్యూటీగానే పునర్నవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్కరికి ఫ్యాన్ అయ్యింది. బిగ్ బాస్ హిస్టరీలో రాహుల్ పునర్నవి జోడికి వచ్చినంత క్రేజ్ ఏ బిగ్ బాస్ సీజన్ లోనూ ఎవరికీ అంతగా రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని కూడా ప్రజలు, ఫాన్స్ యాక్సెప్ట్ చేశారు. అలాంటి పున్ను ఇప్పుడు కొన్ని త్రో బ్యాక్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "జీవితం నాకు మంచి, చెడు, అందం, ఆనందం వంటి ఎన్నో దశలను ఇచ్చింది. ఇక్కడ ప్రతి దశలోనూ నేనున్నాను" అని పోస్ట్ పెట్టింది.