English | Telugu

Ashureddy : వరలక్ష్మి పూజకి అషురెడ్డి వింత డ్రెస్ .. నెటిజన్లు ఫైర్!

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ట్రెండింగ్ లో ఉంటుంది. ‌అందులోను కొంతమంది బుల్లితెర షోలలో నటించేవారు మరీను. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకోవడం ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో షూట్ లు, ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ అయిపోతున్నారు.

తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం సినిమాల్లో గట్టిగానే ట్రై చేస్తుండగా.. అవకాశాలు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అషూ రెడ్డి పెట్టే ఫొటోలు అయితే వేరే లెవల్లో ఉంటున్నాయి. అందాల ఆరబోతలో అంతకుమించి అనేలా అషూ రెచ్చిపోతుంది. అషూ రెడ్డి మరోసారి వివాదంలో నిలిచింది. ఇటీవల ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంది అషూ. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ దీని కోసం ఆమె వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్లు ఏకేస్తున్నారు. పద్ధతిగా చీర కట్టుకొని అందరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అషూ మాత్రం వెరైటీ ఔట్ ఫిట్ వేసింది. పేరుకి చీరే కానీ చూడటానికి మాత్రం మోడ్రన్ ఔట్ ఫిట్‌లా ఉంది. ఈ డ్రెస్‌లో పూజ దగ్గర కూర్చుని ఫొటోలకి పోజులిచ్చింది. దీంతో పూజకి ఇదేం డ్రెస్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

పింకీ ప్రామిస్ అనే పేరుతో షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అషురెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 2మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే ఓ నెటిజన్.. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే నరికేస్త ఒక్కొక్కడిని అని కామెంట్ చేయగా దానికి అషురెడ్డి.. " నువ్వు తగ్గొద్దు మావా.. వేసేయ్ అంతే " అని రిప్లై ఇచ్చింది. ఇక అది చూసి ఆ నెటిజన్ షాక్ అయి.. ఇది ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. ఇక ఇదే పోస్ట్ కి బార్బీ గాల్.. ఉమ్మా.. అంటు స్టెల్లా రాజ్ కామెంట్ చేసింది. ఇలా కొంతమంది సెలెబ్రిటీలు కూడా ఈ పోస్ట్ కి రియాక్ట్ అవ్వడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.