English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమ తెలిసిపోయింది.. రివర్స్ డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -223 లో.....సందీప్, శ్రీలతలు రౌడీ తో ఉన్న ఫోటోలని నందిని వాళ్లకు పంపిస్తుంది. అది చూసి శ్రీలత, సందీప్ లు షాక్ అవుతారు అప్పుడే నందిని ఫోన్ చేసి.. మీరు ఇద్దరు ఇక్కడికి రావాలి లేదంటే ఆ ఫోటోలు సీతాకాంత్ కి పంపిస్తానని చెప్తుంది. దాంతో కంగారుగా శ్రీలత, సందీప్ లు నందిని దగ్గరికి వెళ్తారు. మీరూ చూపించే సవతి ప్రేమ నాకెలా తెలుసనుకుంటున్నారా అని నందిని అంటుంది. రామలక్ష్మి అడ్డు తొలగించి ఆస్తులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారని నాకు తెలుసు అని నందిని అంటుంది. అప్పుడే సందీప్, శ్రీలతలు గోడకి సీతాకాంత్, నందినిలున్నా ఫోటోని చూసి రివర్స్ డ్రామ ప్లే చేస్తుంటారు.