English | Telugu

సుమ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనం!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. పల్లవి, రవికిరణ్, మానస, శ్రీలలిత, హృతేష్, భావనా రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఐతే రవి కిరణ్ , హృతేష్ కలిసి సుమ ఇంట్లో దొంగతనం ప్లాన్ చేశారు. టీవీలో ఎక్కడ చూసినా సుమ గారే కనిపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో డబ్బులున్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంది...అంటే అంబానీ, అమితాబచ్చన్ తర్వాత సుమ గారి దగ్గరే బాగా డబ్బుంది. ముందు అబ్జర్వ్ చేద్దాం, తర్వాత ప్లానేద్దాం, తర్వాత నూనె రాసుకుందాం, తర్వాత చెడ్డీ వేసుకుందాం అని ముందుగా దొంగతనం ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్నారు.

తర్వాత రవికిరణ్ ఇలా అన్నాడు. దొంగతనం చేయడానికి మంచి టైం ఏదంటే "సుమ అడ్డా షో లో ఇరుక్కుపోయి ఉంటదిగా..అదే మంచి టైం దొంగతనానికి" అని అనేసరికి "కాదు కాదు ఆమె ఎప్పుడూ జిమ్ కి వెళ్లి ఓ ఎక్ససర్సైజులు చేసేస్తూ ఉంటుందిగా ఆ టైం ఐతే బెటర్ దొంగతనానికి" అని చెప్పాడు హృతేష్. ఇలా వీళ్ళిద్దరూ సుమ ఇంట్లో దొంగతనానికి వెళ్ళబోతున్నారు. ఇక వీళ్ళ ప్లానింగ్ కి సుమ రియాక్షన్ చూడాలి మాములుగా లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.