Karthika Deepam2 : వాళ్ళని క్షమించలేరా.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -169 లో... శౌర్యని తీసుకొని నరసింహా వెళ్ళాలనుకుంటాడు. శౌర్యని అడ్డు పెట్టుకుని దీపని రప్పించి.. ఇల్లు సొంతం చేసుకోవాలనుకొని రిమోట్ కార్ ని నర్సింహా లోపలికి పంపిస్తాడు. అది చూసి సరదాగా శౌర్య బయటకు వస్తుంది. అప్పుడే దీప, కార్తీక్ లు వస్తారు. శౌర్యతో కార్తీక్ మాట్లాడతాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావంటూ చాక్లెట్ ఇచ్చి లోపలికి వెళ్లమని చెప్తాడు. వీడు ఎప్పుడు అడ్డుపడుతున్నాడని నరసింహా అనుకోని వెళ్ళిపోతాడు.