English | Telugu

Eto Vellipoyindhi Manasu : అటు ప్రేయసి, ఇటు కసాయి తల్లి కన్నింగ్ ..  

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -229 లో.... రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే నందిని వచ్చి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళావా.. సర్ ప్రైజ్ ఇచ్చావా.. తను హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా అని నందిని అంటుంది. అవును నీ గురించి చెప్పు.. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లే.. నువ్వు కూడా ఎవరినైనా చేసుకోమని సీతాకాంత్ అంటాడు. లేదు నేను ప్రేమించింది ఒక్కరినే అంతే.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికి అర్ధం లేదని నందిని చెప్తుంది.

మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో పండు డైలాగ్స్ మాములుగా లేవు. ఈ మధ్య డాన్సర్ పండు జబర్దస్త్ స్కిట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక రాబోయే వారం షోలో వర్ష - పండు కలిసి స్కిట్ చేశారు. పండు స్టేజి మీదకు వర్షాతో పాడు తెగ సిగ్గుపడుతూ వచ్చాడు. "సర్ మేము మొగుడూపెళ్లాలం సర్" అన్నాడు శివాజితో. తర్వాత వర్ష వైపు చూస్తూ "మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు" అంటూ సిగ్గుమొగ్గలవుతూ అక్కడేదో వాళ్ళ మధ్య జరగకూడనిది జరిగిపోయినట్టు బిల్డప్ ఇచ్చి మరీ అడిగాడు. "పెద్ద ఏమీ అనిపించడం లేదు" అన్నాడు. ఇక జడ్జ్ శివాజీ ఐతే "పండు సూపర్ గా ఉంది కానీ" అని ఎంకరేజ్ చేసాడు. తర్వాత వర్షని హగ్ చేసుకున్నాడు పండు గట్టిగా. దాంతో వర్ష ఒక్కసారిగా షాకయ్యింది. "బాధపడకు" అంటూ ఓదార్చబోయాడు.