English | Telugu

నేను ప్రేమించే అమ్మాయి...అమ్మాయా...కాదా

జబర్దస్త్ కమెడియన్స్ లో ప్రముఖంగా ఇమ్మానుయేల్ పేరు చెప్పుకోవచ్చు. జబర్దస్త్ సైడ్ కమెడియన్ నుంచి టీంలీడర్ అయ్యాడు. అలాగే కొంతవరకు మంచి స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఒక చిట్ చాట్ లో రకరకాలల ఆన్సర్స్ ఇచ్చాడు. "నేను ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటంటే బేసిక్ గా నా బండి యాక్టివ్. మిగతా వాళ్లందరితో  నేను జోవియల్ గా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. లవ్ లెటర్స్ రాసే రోజులు కావు ఇవి. ఎవరూ నాకు లవ్ లెటర్స్ రాయలేదు. కానీ బాగా చేస్తాను అని అందరూ మెచ్చుకుంటారు. కోపాన్ని ఎప్పుడూ చూపించను నేను. ఐతే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ముందు నేను అసలు అమ్మాయా కాదా అని చూస్తాను ఎందుకంటే ఈరోజున ఎవరినీ నమ్మే పరిస్థితి ఉండడం లేదు. చేసిన సినిమాలు అవీ సరిగా ఆడనప్పుడు కొంచెం బాధపడతాను. నేను యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు.

Gowtham Av : కెజెఎఫ్ లెవెల్ లో గౌతమ్ జర్నీ వీడియో.. ఓటింగ్ లో అతడికే ప్లస్!

బిగ్ బాస్ సీజన్-8 లో గౌతమ్ ఎలిమినేషన్ దాకా వెళ్లి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రతీ టాస్క్ ఫుల్ కసిగా ఆడుతూ వంద శాతం ఎఫర్ట్స్ తో టాప్-5 లో చోటు దక్కించుకున్నాడు. అయితే బయట ఎలా ఉందంటే.. గౌతమ్‌ని బిగ్ బాస్ టీమ్ తొక్కేస్తుంది.. నిఖిల్‌ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఇలా చేశారేమో అని అనుకుంటున్నారు. కానీ గౌతమ్ జర్నీ వీడియో చూసాక అది మార్చుకుంటారు. గౌతమ్ జర్నీ వీడియో అదిరిపోయింది. ఇది అందరికంటే ముందు చూపించడం కూడా ఓటింగ్ పరంగా అతనికి చాలా ప్లస్. ఎందుకంటే కీలకమైన చివరి వారంలో ఈ జర్నీ వీడియో కూడా ఓటింగ్‌ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.

Karthika Deepam2:  దీప మర్డర్ ప్లాన్ చేసిన జ్యోత్స్న.. కిల్లర్ చంపగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-226 లో.. ఆఫీస్ కి కార్తీక్ ని రప్పించుకొని పనిచేపిస్తుంటుంది జ్యోత్స్న. ఇక తనని దగ్గరుండి చూసుకుంటూ ఉండగా.. కార్తీక్ మాత్రం పట్టించుకోడు. ఏంటి బావా.. నేను తెచ్చిన కాఫీ, జ్యూస్, బిస్కెట్స్ ఏమీ తీసుకోలేదు. ఇక కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవా? అర్థమైందిలే.. సరే పదా బావా.. కారులో అలా వెళ్లి ఏదైనా తిని ఇంటికి వెళ్దామని జ్యోత్స్న అనగా.. కార్తీక్ పెద్దగా పట్టించుకోడు. నేను అర్జెంట్‌గా ఇంటికి వెళ్లాలని కార్తీక్ అంటాడు. ఎవరి కోసమని జ్యోత్స్న అనగా.. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగుతుంది. లిఫ్ట్ చేసి స్పీకర్‌ ఆన్ చేసి.. శౌర్య కాల్ చేసినట్లుందని కార్తీక్ అనుకుంటాడు. అవతల నుంచి కార్తీక్ బాబు అని దీప అనగానే.. స్పీకర్‌లో దీప వాయిస్ విని.. జ్యో రగిలిపోతుంది. వెంటనే కార్తీక్ స్పీకర్ ఆఫ్ చేస్తాడు.

Brahmamudi : యావదాస్తిని కావ్యకి రాసిచ్చిన ఇంటిపెద్ద.. షాక్ లో ఆ ముగ్గురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -591 లో....రాజ్ గదిలో ఇంట్లో జరుగుతున్న సంఘటనలకి బాధపడుతుంటే.. కావ్య వస్తుంది. మీరు ఈ ఇంటికి వారసుడు.. మీరు ఎందుకిలా బాధపడుతున్నారని కావ్య అనగానే.. ఆ విషయం నువ్వు చెప్తే గానీ నాకు అర్థం కావడం లేదంటూ చిరాకుగా మాట్లాడతాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. మంచి పని చేసావ్.. నీ వళ్లనే కొడుకుకి న్యాయం జరుగుతుంది.. అలాగే నా కొడుకుకి న్యాయం జరుగుతుందని రుద్రాణి అంటుంది. నీకు థాంక్స్ అని రుద్రాణి అనగానే.. అసలు నీకే థాంక్స్ చెప్పాలి ఈ ఆలోచన నాకు ఇచ్చావని ధాన్యలక్ష్మి అంటుంది.

కాఫీలు, టీలు తాగకపోయినంత మాత్రాన ఏమీ కాదు

చాలామందికి ఉదయాన్నే లేచాక ఖాళి కడుపుతో కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే డాక్టర్స్ కానీ ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు కానీ ఒక్కటే చెప్తారు ఖాళీ కడుపుతో ఇలాంటివి తాగకూడదు అలాగే ఆయిల్ ఫుడ్ తినకూడదు అలా చేస్తే జీర్ణవ్యవస్థ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అని. ఐతే ఇప్పుడు బుల్లితెర నటి అనిత చౌదరి కూడా అదే చెప్తోంది. ఉదయాన్నే లేచి ఇవి తాగడం వలన మలబద్దకం వస్తుంది, జీర్ణ వ్యవస్థ లైనింగ్ పాడైపోతుంది. దాంతో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అలా కాకుండా ఉదయాన్నే లేచాక ఒక గ్లాసుడు నీళ్లు తాగి ఏదైనా స్నాక్ అంటే ఒక బిస్కెట్ కానీ అలా ఏదైనా తినేసి కాఫీ ఆర్ టీ కానీ తాగితే చాలా బెటర్ గా ఉంటుంది అని చెప్పింది.

హైలైట్ గా నిలిచిన గౌతమ్ జర్నీ వీడియో.. ఆ మాట చెప్పి కాలర్ ఎగరేశాడు!

బిగ్ బాస్ ఆట మరో కీలకమైన దశకు చేరుకుంది. ఫినాలే వీక్‌లో ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలు వాళ్ల ఓటింగ్‌పై చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ల జర్నీని ఎంత బాగా చూపిస్తే అన్ని ఓట్లు. ఎవరి జర్నీని ఎలా చూపించారు? ఎంతసేపు చూపించారు? ఎప్పుడు చూపించారు? ఇవన్నీ కూడా చాలా కీలకమే. అయితే ఇక విజేతను తేల్చేందుకు మూడు రోజుల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్ట్‌లలో తొలి జర్నీ వీడియో గౌతమ్‌ దే అయ్యింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి విన్నర్ రేస్‌లోకి దూసుకుని వచ్చాడు గౌతమ్. అశ్వర్థామ ఈజ్ బ్యాక్ అంటూ టైటిల్‌కి మరో అడుగుదూరంలో ఉన్నాడు గౌతమ్.

Illu illalu pillalu : సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న కొడుకు.. వారి ఆశీర్వాదం తీసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -26 లో.....నర్మద తన పేరెంట్స్ ని గుర్తుచేసుకొని పెళ్లి పీఠల మీద నుండి పక్కకి వచ్చి బాధపడుతుంటే.. ధీరజ్ వెళ్లి మీరేం బాధపడకండి. మిమ్మల్ని మా వాళ్ళకి దగ్గర చేస్తాను. సొంత కూతురులాగా చూసుకుంటారని నర్మదకి దైర్యం చెప్తాడు ధీరజ్. దిష్టి తగులుతుందని తన చెంపకి కాలుకి దిష్టి చుక్కపెడతాడు ధీరజ్. అలా చెయ్యడంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్లి పెళ్లి పీఠలపై కూర్చొని ఉంటుంది. తన బాధపోగొట్టినందుకు ధీరజ్ కి సాగర్ థాంక్స్ చెప్తాడు.