English | Telugu

ఈ షోకి వచ్చింది కూడా తేజు లిప్స్ చూడడానికే

ఆర్జే చైతు బెజవాడ కుర్రాడే. ఇతని పూర్తి పేరు చైతన్య బసవ. అతను రేడియో జాకీ. అలా సోషల్ మీడియాలో ఆర్జేగా మంచి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ కి వెళ్లి బాగా ఫేమస్ అయ్యాడు. అటు షోస్ కి, ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఇట ఆర్జే చైతూకు లేడీస్ లిప్స్ అంటే బాగా ఇష్టం అంట. ఆ విషయాన్నీ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు. తేజు ఆడిన రాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో తనకు ప్రదీప్ యాంకరింగ్ ఇష్టమని, ఆర్జేని కాకపోయి ఉంటే యాంకర్ ని అయ్యేవాడిని. శ్రీముఖిలో తనకు నచ్చని క్వాలిటీ ఏంటంటే నచ్చకపోతే బ్లాక్ చేస్తుంది పర్లేదు అనుకున్నాక అన్ బ్లాక్ చేస్తుంది.

నేను ప్రేమించే అమ్మాయి...అమ్మాయా...కాదా

జబర్దస్త్ కమెడియన్స్ లో ప్రముఖంగా ఇమ్మానుయేల్ పేరు చెప్పుకోవచ్చు. జబర్దస్త్ సైడ్ కమెడియన్ నుంచి టీంలీడర్ అయ్యాడు. అలాగే కొంతవరకు మంచి స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఒక చిట్ చాట్ లో రకరకాలల ఆన్సర్స్ ఇచ్చాడు. "నేను ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటంటే బేసిక్ గా నా బండి యాక్టివ్. మిగతా వాళ్లందరితో  నేను జోవియల్ గా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. లవ్ లెటర్స్ రాసే రోజులు కావు ఇవి. ఎవరూ నాకు లవ్ లెటర్స్ రాయలేదు. కానీ బాగా చేస్తాను అని అందరూ మెచ్చుకుంటారు. కోపాన్ని ఎప్పుడూ చూపించను నేను. ఐతే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ముందు నేను అసలు అమ్మాయా కాదా అని చూస్తాను ఎందుకంటే ఈరోజున ఎవరినీ నమ్మే పరిస్థితి ఉండడం లేదు. చేసిన సినిమాలు అవీ సరిగా ఆడనప్పుడు కొంచెం బాధపడతాను. నేను యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు.